సుకుమార్ డైరెక్షన్‌లో అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో బన్నీ చేసిన అద్భుత నటనకు బాలీవుడ్ ఆడియన్స్ సైతం ఫ్యాన్స్‌గా మారిపోయారు. ఎర్ర చందనం చుట్టూ తిరిగే ఈ సినిమాను సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు. కూలి స్థాయి నుంచి ఎర్రచందనం సిండికేట్ నాయకుడిగా బన్నీ ఎదిగిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. క్లైమాక్స్‌లో పోలీసు ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్‌కు అదిరిపోయే రేంజ్‌లో బన్నీ వార్నింగ్ ఇవ్వడంతో తొలి పార్ట్ ముగుస్తుంది.
పుష్ప తొలి పార్ట్‌ను చాలా ప్రశ్నలతోనే సుకుమార్ ముగించాడు. ఆ ప్రశ్నలకు సమాధానం కావాలంటే రెండో పార్ట్ చూడాల్సిందే అన్న ఆసక్తిని సగటు ప్రేక్షకుడి కలిగించాడు. దీంతో పుష్ప 2 కథను ఎవరికి నచ్చినట్లు వారు ఊహించేసుకున్నారు. కేజీఎఫ్-2 లాగా పుష్ప సెకండ్ పార్ట్ ఉంటుందని జోస్యం చెప్పడం ప్రారంభించారు. వీటన్నింటికిి సుకుమార్ చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. పుష్ప 2కు సంబంధించిన 20 సెకన్ల వీడియోను విడుదల చేసి సినిమా కథను చెప్పకనే చెప్పేశాడు.
ఆసక్తికరంగా గ్లింప్స్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్‌ను బట్టి… హీరో పుష్ప(అల్లుఅర్జున్) పై పోలీసు ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ రివేంజ్ తీర్చుకున్నట్లు తెలుస్తోంది. పుష్పను అరెస్టు చేసి తిరుపతి జైలులో బంధించినట్లు కనిపిస్తోంది. పుష్ప జైలు నుంచి తప్పుకోవడం ఆసక్తిరేపుతోంది. దీంతో పుష్ప మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తారు. అసలు పుష్ప ఎక్కడ?. అంటూ 20 సెకన్లలో ముగుస్తుంది. దీనికి కొనసాగింపుగా మరింత సమాచారం కావాలంటే ఏప్రిల్ 7th సా. 4.05 ఆగాల్సిందేనని వీడియోలో కనిపిస్తోంది. అయితే తాజాగా రిలీజైన వీడియో పుష్ప 2పై పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
పుష్పకు ప్రజాదరణ
తొలిపార్ట్‌లో పుష్ప ఎర్ర చందనం స్మగ్లర్‌గా కనిపిస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఎర్ర చందనం దుంగలను తరలించి సిండికేట్ సభ్యులను ఆకర్షిస్తాడు. మెుదటి పార్ట్‌లో హీరోకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉండదు. అయితే సెకండ్ పార్ట్‌లో పుష్పకు ఫాలోయింగ్ ఉన్నట్లు తాజాగా రిలీజైన వీడియోలో చూపించారు. మరి ఒక్కసారిగా పుష్పకు ప్రజల మద్దతు ఎలా పెరిగిందన్న అంశం ఆసక్తిరేపుతోంది. ఎర్రచందనం ద్వారా సంపాదించిన డబ్బును పుష్ప ఏమైనా ప్రజా శ్రేయస్సుకు ఖర్చు చేసి ఉంటాడా? అన్న అనుమానం కూడా కలుగుతోంది. ప్రజలకు మేలు కలిగించే పనులు చేసి వారి మద్దతు చొరగొన్నాడా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
కేశవ నమ్మక ద్రోహం?
పోలీసుల కళ్లుగప్పి తిరిగే పుష్ప ఎలా అరెస్టయ్యాడనేది ఆసక్తికరం. పుష్పను పోలీసులకు తన ప్రాణ స్నేహితుడు కేశవే పట్టించాడని సోషల్ మీడియాలో నెటిజన్లు ఊహిస్తున్నారు. ఇదే సినిమాలో ట్విస్ట్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. శ్రీవల్లి క్యారెక్టర్ కూడా పుష్పకు దూరమయ్యే అవకాశం ఉందని చర్చిస్తున్నారు.
పుష్ప 2లో ప్రతికారం..
మెుదటి పార్ట్‌లో మంగళం శీను (సునీల్), దాక్షాయణి (అనసూయ), జాలిరెడ్డి (ధనుంజయ్) డీఎస్పీ గోవిందప్పను పుష్ప చాలా ఇబ్బందులకు గురిచేస్తాడు. పుష్ప కారణంగా జాలిరెడ్డి మంచానికి పరిమితం కాగా, మంగళం శీను తన బామ్మర్దిని కోల్పోతాడు. మరి సెకండ్ పార్ట్‌లో వారు కూడా షెకవాత్‌తో చేయి కలిపి పుష్పపై పగ తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ప్రజాదరణ పొందిన పుష్పను షెకావత్ ఏ కేసులో అరెస్టు చేశాడో తెలియాల్సి ఉంది. మరి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప షెకావత్‌పై ఎలా రివేంజ్ తీర్చుకుంటాడు? శ్రీవల్లి కడవరకు ఉంటుందా? పుష్ప స్నేహితుడు కేశవ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నమ్మకద్రోహం చే తెలియాలంటే పుష్ప-2 చూడాల్సిందే.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్