• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అందానికే అసూయ కలిగిస్తున్న అనసూయ

  బుల్లితెర యాంకర్‌గా సుపరిచితమై తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి ‘అనసూయ’. తన లేటెస్ట్ ఫొటోలతో అందానికే అసూయ కలిగించేలా కనిపిస్తోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి తెలుగు అభిమానుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం అనసూయ వివిధ టీవీ కార్యక్రమాలతో పాటు సినిమాల్లోనూ నటిస్తోంది. అవకాశం వస్తే ఐటెమ్ సాంగ్స్‌లోనూ అలరిస్తోందీ బ్యూటీ. అయితే, సోషల్ మీడియాలోనూ అనసూయ నిత్యం యాక్టివ్‌‌గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేయడమే కాకుండా, తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తుంటుంది. Courtesy Twitter:anasuyakhasba Courtesy Twitter: … Read more

  పుష్ప2లో జగపతిబాబు?

  పుష్ప2లో సీనియర్ యాక్టర్ జగపతిబాబు కీలక రోల్‌లో నటించనున్నట్లు తెలిసింది. ఆయన కోసం ప్రత్యేక పాత్రను డైరెక్టర్ సుకుమార్ డిజైన్ చేసినట్లు సమాచారం. నేటి నుంచి వైజాగ్‌లో పుష్ప2 మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. అప్‌కమింగ్ షెడ్యూల్‌లో జగపతి బాబు పాల్గొంటారని టాక్. అయితే జగ్గుబాయ్ పాత్రపై మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక అప్‌డేట్ లేదు. కావాలనే జగపతిబాబు రోల్‌ను సస్పెన్స్‌లో ఉంచారని తెలిసింది.

  పుష్ప2 అప్‌డేట్ చెప్పేసిన రష్మిక

  పుష్ప సినిమాతో మరింతగా పాపులర్ అయిన హీరోయిన్ ‘రష్మిక మందన్న’. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. అయితే, పుష్ప2 కు సంబంధించిన అప్డేట్‌ని శ్రీవల్లి లీక్ చేసింది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైందని రష్మిక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. సరికొత్తగా తన పాత్ర ఉండబోతున్నట్లు క్లూ ఇచ్చింది. వచ్చే నెల నుంచే తన పార్ట్ చిత్రీకరించనున్నట్లు స్పష్టం చేసింది. రెండో భాగం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు రష్మిక తెలిపింది. కాగా, ఇటీవల విజయ్ సరసన ‘వారసుడు’లో నటించింది. ప్రస్తుతం మిషన్ … Read more

  సుకుమార్- ప్రభాస్ కాంబోలో సినిమా?

  టాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రభాస్, సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్‌కి సుక్కు ఓ లైన్ చెప్పారట. అది నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేయాలని ప్రభాస్ సుకుమార్‌కి సూచించినట్లు టాక్. దీంతో ఫ్యాన్స్‌లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే మరో క్రేజీ హిట్ పక్కా అంటూ విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్.. సలార్ సినిమాతో బిజీగా ఉన్నారు. అటు సుకుమార్ కూడా పుష్ప2 చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ అనంతరం చెర్రీతో సుక్కు సినిమా … Read more

  పుష్ప2లో అనసూయ హాట్ ఐటెం సాంగ్?

  పుష్ప2 మూవీ నుంచి ఓ క్రేజి న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీలో నెగటివ్ రోల్ చేస్తున్న అనసూయ రెండో భాగంలో ఐటెం సాంగ్ చేయనుందని సమాచారం. ఫస్ట్ పార్ట్‌లో సమంతతో మాస్ మసాలా అందించిన డైరెక్టర్ సుకుమార్.. అనసూయతో అదే రీతిలో హాట్ ఐటెం సాంగ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే పుష్ప2 షూటింగ్ తొలి షెడ్యూల్ ప్రారంభించిన సుకుమార్.. త్వరలోనే బ్యాంకాక్‌లోని దట్టమైన అడవుల్లో కొన్ని ఫైట్ సీన్స్ షూట్ చేయనున్నట్లు తెలిసింది.

  పుష్ప2లో రామ్‌చరణ్ పాత్ర అదేనా?

  పుష్ప సినిమా ఘన విజయం సాధించడంతో రెండో భాగంపై అంచనాలు పెరిగిపోయాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు సుకుమార్ మరింత పకడ్బందీగా రెండో భాగాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే హీరో రామ్‌చరణ్‌తో సినిమాలో అతిథి పాత్ర చేయిస్తున్నట్లు సమాచారం. ఇందులో చెర్రీ ఓ కలెక్టర్‌ పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ సినిమాలో రామ్‌చరణ్ పరిచయ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉంటాయని గతంలో రాజమౌళి చెప్పారు. బహుశా అది పుష్ప సినిమాకు సంబంధించినదే అయ్యుంటుందని ఇండస్ట్రీ వర్గాలు ఊహిస్తున్నాయి. బన్నీ, చెర్రీ కలిసి ఎవడు … Read more

  పుష్ప-2 డైలాగ్‌ అంటూ వైరల్‌

  పుష్పలో డైలాగులు ఏ స్థాయిలో పేలాయో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఇప్పుడు పుష్ప-2లోనూ అదే స్థాయిలో ఉండేలా సుకుమార్ ప్లాన్‌ చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ డైలాగ్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది పుష్ప-2 లోనిది అంటున్నారు. ‘అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయంటే పులి వచ్చిందని అర్ధం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప రాజ్ వచ్చాడని అర్థం’ ఈ డైలాగ్‌ నిజంగా సినిమాలో ఉంటే అరుపులే.

  ‘పుష్ప 2’ షూటింగ్ అప్పటి నుంచేనా..!

  ‘పుష్ప 2’ సినిమా చిత్రీకరణకు సంబంధించి మరొక అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 12నుంచి మరో షెడ్యూలును మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నలు ఈ షూట్‌లో పాల్గొనే అవకాశాలున్నాయి. వీరిద్దరి మధ్య కీలక సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో దాదాపు 10 రోజుల పాటు చిత్ర షూటింగ్ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల పుష్ప సినిమాను రష్యన్ భాషలో విడుదల చేశారు. ప్రమోషన్ల కోసం చిత్రబృందం అక్కడికి వెళ్లి ఇండియాకు తిరిగొచ్చింది. వచ్చే ఏడాది చివర్లో … Read more

  అవతార్‌ సినిమాలో పుష్ప-2 టీజర్‌

  జేమ్స్‌ కామెరూన్‌ విజువల్‌ వండర్‌ అవతార్‌కు దాదాపు 13 ఏళ్ల తర్వాత సీక్వెల్‌ వస్తోంది. అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌ పేరిట వస్తున్న ఈ సినిమా కోసం ఇండియాలోనూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాతో పాటే మరో సర్‌ప్రైజ్‌ కూడా వస్తోంది. అవతార్‌లో పుష్ప-2 టీజర్‌ జత చేస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్‌, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీని అప్టేడ్‌ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

  పుష్ప 2 కాదు.. 3 కూడా ఉందట?

  దేశవ్యాప్తంగా ‘పుష్ప’ సినిమా ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో ‘పుష్ప2’పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన వార్తొకటి చక్కర్లు కొడుతోంది. పుష్ప3 సినిమా కూడా తీద్దామనే ఆలోచనలో డైరెక్టర్ సుకుమార్ ఉన్నారట. ఈ మేరకు పుష్ప సినిమాను వీలైనన్ని ఎక్కువ సిరీస్‌లుగా తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలోనే ఈ సినిమాలు రూపుదిద్దుకోనున్నాయట.