• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కుక్కల నుంచి త్రుటిలో తప్పించుకున్న బాలిక

    [VIDEO](url): ఘజియాబాద్‌లో ఓ 11 ఏళ్ల బాలిక కుక్కల దాడి నుంచి త్రుటిలో తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బాలిక తమ సొసైటీ బిల్డింగ్‌ వైపు పరిగెడుతుండగా కుక్కలు వెంబడించాయి. కాస్తలో కుక్క అందుకునే సమయంలో ఆ బాలిక గేటు దాటింది. వెంటనే సెక్యూరిటీ గార్డు కుక్కలను తరిమేశాడు. నోయిడాలో ఇప్పటికే పెంపుడు జంతువులపై జరిమానా విధిస్తున్నారు. ఎవరి పెంపుడు జంతువైనా మనుషులపై దాడి చేస్తే వారికి రూ.10 వేలు జరిమానా విధిస్తున్నారు. गाजियाबाद के इंदिरापुरम इलाके में … Read more

    ఈమెను చూసైనా బద్దకం వదలండి

    [VIDEO](url):రోజుకు 20 నిమిషాలు వర్కవుట్స్‌ చేయమంటే ఒళ్లు విరుస్తారు అనేకమంది. కానీ, 56 ఏళ్ల వయసులో ఉత్సాహంగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఈ మహిళను చూసి నెటిజన్లు అబ్బురపడుతున్నారు. చీరకట్టులో చకచకా బరువులు ఎత్తేస్తున్న ఈ మహిళ వీడియో ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. నాకు నేనింకా జిమ్‌ చేస్తున్నాను. చేయాలనే తపన ఉంటే నీ దుస్తులు కూడా దానిని ఆపలేవు. నా కోడలు, నేను రోజూ వర్కవుట్స్ చేస్తాం. 52 ఏళ్ల వయసులో నేను తొలిసారి జిమ్‌కు వచ్చా” అంటూ ఆమె రాసుకొచ్చింది. … Read more

    స్మిత్‌ కొత్తగా ట్రై చేశాడు..కానీ!

    [VIDEO](url): ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌లో భాగంగా స్మిత్‌ ఆడిన ఓ షాట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. 32వ ఇన్నింగ్స్‌లో ఆదిల్‌ రషీద్‌ మిచెల్‌ మార్ష్‌కు నోబాల్‌ వేశాడు. ఆ బంతికి సింగిల్‌ తీయడంతో స్ట్రైక్‌ స్మిత్‌కు వచ్చింది. నోబాల్‌ను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో స్మిత్‌ స్విచ్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు. అయితే దీనిని ముందుగానే గమనించిన రషీద్‌ తెలివిగా స్మిత్‌కు బాల్ అందకుండా వేసి… డాట్‌ చేశాడు. ఈ వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్‌ తమ ట్విట్టర్‌లో షేర్ చేసింది. Steve Smith trying something … Read more

    మంగళూరులో పేలిన ఆటో

    [VIDEO](url): కర్ణాటకలోని మంగళూరులో ఆటో పేలుడు కలకలం రేపింది. ఇవాళ ఉదయం అనుమానస్పద రీతిలో ఆటో పేలింది. బ్లాస్ట్‌కు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రమాదమా లేక ఉగ్ర కుట్రనా అన్న కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ఉగ్ర కుట్రగానే అనుమానిస్తున్నామన్న పోలీసులు… దీనిపై ముమ్మర దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం బృందాలు కూడా దర్యాప్తులో పాల్గొంటాయని ఆ రాష్ట్ర హోం మంత్రి జ్ఞానేంద్ర చెప్పారు. #BreakingNews | Blast not an accident, but an act of … Read more

    “బాలివుడ్‌ కూలిపోతుందని అప్పుడే చెప్పాడు”

    [VIDEO](url): సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో తెలీదు. ఇటీవల బాలివుడ్‌ సినిమాల వరుస వైఫల్యాలతో కొట్టు మిట్టాడుతున్న వేళ.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ దీనిని ముందే ఊహించాడంటూ వైరల్‌ చేస్తున్నారు. SSR Hinted Bollywood Collapse అనే వాక్యాన్ని ట్రెండ్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను కూడా జత చేస్తున్నారు. ‘నెపోటిజం ఉండొచ్చు కానీ అది కొత్త వారిని ఎదగనివ్వనంతగా ఉంటే మాత్రం బాలివుడ్‌ కుప్పకూలిపోక తప్పదు’ అంటూ గతంలో సుశాంత్ చేసిన వ్యాఖ్యలను జత చేస్తున్నారు. SSR … Read more

    కాపాడబోయి కన్ను పోగొట్టుకుంది

    [VIDEO](url): అమెరికాలోని కాలిఫోర్నియా ఓ వికలాంగుడికి మద్దతుగా నిలిచినందుకు మహిళ కంటిని కోల్పోయింది. ఓ రెస్టారెంట్‌లో పనిచేసే ఓ మహిళ… అక్కడ ఒక వికలాంగుడిని కొంతమంది ఏడిపిస్తుంటే అడ్డు చెప్పింది. దీంతో ఆ గుంపులోని వ్యక్తులు మహిళపై దాడికి తెగబడ్డారు. ఒక్కసారిగా ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ఆమె కంటికి తీవ్ర గాయమై..చూపు కోల్పోయింది. వారు అలా దాడి చేస్తారని తాను అస్సలు ఊహించలేదని మహిళ బాధను వ్యక్తం చేసింది. @raulbrindis Un hombre golpeó repetidamente a Bianca Palomera, 19, … Read more

    ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత

    హైదరాబాద్‌లో ఎంపీ అరవింద్‌ ఇంటివద్ద తీవ్ర [ఉద్రిక్తత](url) చోటుచేసుకుంది. కవిత కాంగ్రెస్‌లో చేరతానంటూ మల్లిఖార్జున ఖర్గేకు కాల్‌ చేసిందంటూ నిన్న అరవింద్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎంపీ ఇంటిముందు టీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనకు దిగారు. ఇంట్లోకి దూసుకెళ్లి సామగ్రిని ధ్వంసం చేశారు. ఫర్నీచర్‌, కిటీకీలు, కారు అద్దాలు పగులగొట్టారు. దాడి సమయంలో అరవింద్‌ ఇంట్లో లేరు. #TRS cadre attack the #BJP MP Aravind's residence at #Hyderabad and not him. Sorry!!!#Telangana https://t.co/Avbq9BQwf3 — Sagar KV ?  … Read more

    ర్యాగింగ్‌ అంటూ బాలికకు ముద్దులు

    [VIDEO](url): ర్యాగింగ్‌పై ప్రభుత్వం ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇప్పటికీ పలుచోట్ల వికృత చేష్టలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఒడిశాలో ఓ విద్యార్థిని పట్ల కొందరు విద్యార్థులు అనుచితంగా ప్రవర్తించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బరంపురంలోని బినాయక్‌ ఆచార్య డిగ్రీ కళాశాలలో ఈ ఘటన జరిగింది. ఇందులో ఇప్పటికే ఐదుగురు విద్యార్థులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తెలిపారు. In Binayak acharya college campus what's going sir @SP_BERHAMPUR In simple word it's called … Read more

    ‘గీతా ఆర్ట్స్‌’ ముందు నగ్నంగా నిరసన

    [VIDEO](url): నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశారంటూ గతంలో ‘గీతా ఆర్ట్స్‌’ కార్యాలయం ముందు నిరసనకు దిగిన సునీత బోయ…మరోసారి ఆందోళన చేశారు. గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ఎదుట నగ్నంగా కూర్చుని నిరసన తెలిపింది. ఆమె చాలాకాలంగా ఈ ఆరోపణలు చేస్తోంది. ఆమె మానసిక పరిస్థితి బాగా లేదని గతంలో ఆమెకు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గురువారం రాత్రి మరోసారి నగ్నంగా ఆందోళకు దిగడంతో…మహిళా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెకు సర్దిచెప్పి పంపించారు. https://twitter.com/sairaaj44/status/1593275796218863618?s=20&t=YhoSLeZKK7HE98dc4qzz4g

    తన కూతురి తెరగేట్రంపై రోజా క్లారిటీ

    తన పిల్లలు సినిమాల్లోకి వస్తానంటే చాలా సంతోషిస్తానని మంత్రి రోజా అన్నారు. నటన తప్పు అని నేనెప్పుడూ చెప్పను. వారు సినిమాల్లోకి వస్తామంటే నిజంగా నేను చాలా సంతోషిస్తా. కానీ నా కూతురు సైంటిస్ట్‌ కావాలనుకుంటోంది. బాగా చదువుతోంది. ఇప్పటికైతే తనకు సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు. వస్తే ఒక హీరోయిన్‌గా, ఒక తల్లిగా అండగా నిలుస్తా’ అని రోజా అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.