భారతీయ చిత్రాలు RRR, ది ఎలిఫెంట్ విస్పరర్ సినిమాలకు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. దేశం మెుత్తం గర్వించింది. ఇలాంటి సమయంలో ఆస్కార్‌ను కూడా కొన్నారంటూ ఓ మేకప్ ఆర్టిస్ట్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మేకప్ చేసే షాన్ ముట్టాత్తిల్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో నెటిజన్లు అతడిపై విరుచుకుపడుతున్నారు.
తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాటకు ఆస్కార్ ఇవ్వటం పట్ల అక్కసు వెళ్లగక్కడా షాన్.
నాటునాటుకు ఆస్కార్ ఇవ్వటం చాలా హాస్యాస్పదం. భారత్‌లో అవార్డులు కొంటారని అనుకున్నా. కానీ, ఇప్పుడు ఏకంగా ఆస్కార్స్. మనదగ్గర డబ్బుంటే ఏదైనా వస్తుంది. ఆస్కార్‌తో సహా” అన్నాడు.
షాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. నీ మాటల్లో ఈర్ష్య స్పష్టంగా కనిపిస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
తెలుగు సినిమాకు ఆస్కార్ రావటం బాలీవుడ్‌లో చాలామందికి నచ్చలేదనే వాదన లేకపోలేదు. ఎందుకంటే, బాహుబలి నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు టాలీవుడ్ సినిమాలు అక్కడ ఏలుతున్నాయి.
నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాలీవుడ్‌లో రూ. 100 కోట్ల వసూళ్లు సాధించడం ఇందుకు నిదర్శనం. ఈ కారణంగానే కొంతమంది నాటునాటుకి ఆస్కార్ రావటాన్ని ఓర్వలేక పోతున్నారని వినికిడి.
నాటునాటుకి ఆస్కార్ రావటం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. కానీ, బాలీవుడ్ నుంచి పెద్దగా స్పందన రాలేదు.
ఈ క్రమంలో మేకప్ ఆర్టిస్ట్ షాన్ చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని పెంచాయి. దీంతో ట్రోలర్స్ చేతికి పనిదొరికనట్లయ్యింది.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్