• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సెల్ఫీ కోసం ‘వందేభారత్’ ఎక్కి బుక్కయ్యాడు

    [VIDEO](url):సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ఈ మధ్యనే ‘వందే భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. కొత్తగా వచ్చింది కాబట్టి సాధారణంగానే ఈ ట్రైన్‌పై అందరికీ ఆసక్తి ఉంటుంది. అదే ఉత్సుకతతో రాజమహేంద్రవరంలో ఓ వ్యక్తి సెల్ఫీ కోసం వందేభారత్‌ ఎక్కాడు. ఇంతలో ఆటోమేటిగ్‌గా రైలు డోర్‌ మూసుకుపోయింది. TTE వచ్చి ఏంటని అడగ్గా.. సార్ కొత్త ట్రైన్‌ అని సెల్ఫీ కోసం ఎక్కాను దిగేస్తాను సార్‌ అంటూ ప్రాధేయపడ్డాడు. కానీ దిగడం కుదరదు విజయవాడ దాకా మాతో పాటు రావాల్సిందేనంటూ TTE చెప్పాడు. Man steps … Read more

    ‘వాల్తేరు వీరయ్య’ వీక్షించిన వైసీపీ ఎమ్మెల్యే

    AP: శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చురకలంటించారు. అన్నయ్యను చూసి తమ్ముడు నేర్చుకోవాలంటూ పరోక్షంగా విమర్శించారు. వాల్తేరు వీరయ్య సినిమాను వీక్షించిన అనంతరం మధుసూధన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చిన్నప్పటి నుంచి అభిమానిగా సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు కార్యకర్తలతో కలిసి వాల్తేరు వీరయ్య సినిమా చూడటం ఆనందంగా ఉంది. అన్నదమ్ముల అనుబంధంతో సినిమా చాలా బాగుంది. అన్నయ్యను చూసి తమ్ముడు నేర్చుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ నెట్టింట్లో … Read more

    పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ జోకర్: రోజా

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో మంత్రులను తిట్టడానికే పవన్‌ సభ పెట్టారు. ఆయన్ను ఏమనాలో కూడా అర్థంకావడం లేదు. ఆయనోక పొలిటికల్ జోకర్. సంక్రాంతి పండగకు చిరంజీవికి వాల్తేరు వీరయ్య కలెక్షన్లు, బాలయ్యకు వీరసింహారెడ్డి కలెక్షన్లు వస్తే పవన్‌కు చంద్రబాబు నుంచి ప్యాకేజీ వచ్చింది అంటూ ఎద్దేవా చేశారు.

    LIVE: సీఎం జగన్ ఇంట సంక్రాంతి సంబురాలు

    సీఎం జగన్ ఇంట సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సీఎం జగన్‌ దంపతులు ముందుగా జ్యోతిని వెలిగించి సంక్రాంతి సంబరాల్ని ప్రారంభించారు. అనంతరం గోశాలలో గోపూజ చేసి… భోగి మంటను వెలిగించారు. హరిదాసు కీర్తనలు ఆలకించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

    యువతులతో అంబటి ఊరమాస్ స్టెప్పులు

    ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అక్కడ ఉన్న మహిళలు, యువతులతో డ్యాన్స్‌ చేశారు. భోగి వేడుకలు చూసేందుకు వచ్చిన వారికి హుషారెత్తించారు.

    భోగి వేడుకల్లో చంద్రబాబు, బాలయ్య

    సొంతఊరు నారావారిపల్లెలో భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబసభ్యులు భోగి మంటల్లో పాలుపంచుకున్నారు. తెలుగురాష్ట్రాల ప్రజలకు బాలయ్య భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకల్లో నారవారిపల్లే ప్రజలతో పాటు తిరుపతి జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు

    రోజా.. అది నోరా.. కుప్పతొట్టా? సినీనటుడు నాగబాబు

    ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజాపై జనసేన నాయకుడు, సినీనటుడు నాగబాబు మండిపడ్డారు. తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్‌ను విమర్శించడంపై రోజాపై ధ్వజమెత్తారు. ‘‘రోజా.. నీది నోరా.. [కుప్పతొట్టా](url)’’ అని ఎద్దేవా చేశారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని.. ఆ శాఖను ఎలా అభివృద్ధి చేయాలో నేర్చుకోమని హితవు పలికారు. రోజా మంత్రి పదవి నుంచి దిగిపోయేసరికి పర్యాటక రంగం సర్వనాశనం అయిపోతుందని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్రెండింగ్‌లో ఉంది. #KuppaThottiRoja https://t.co/Y1ri1JB8QW — satyam (@SatyamAmp) … Read more

    సంక్రాంతి పందెంకోళ్ల జాతులు ఎన్ని?  వీటిని ఎలా పెంచుతారు?

    సంక్రాంతి అంటే రంగవల్లులు, గంగిరెద్దులు, భోగిమంటలే కాదు. కోడి పందేలు కూడా. ఈ ఆట ఆడనిదే సంక్రాంతి సంపూర్ణం కాదు. ఓ సరదాగా మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు వ్యాపారంలా మారిపోయింది.  50 రకాలు పందెం కోళ్లలో సుమారు 50 రకాల వరకు ఉన్నాయి. కాకి, నెమలి, డేగ, పచ్చ కాకి, పర్ల, సేతువా, పూల, పింగళి, కౌజు, ఎర్రబోరా, నల్లబోరా, మైల, కొక్కిరాయి, నవల ఇలా చాలానే పేర్లున్నాయి. వీటిలో కాకి, డేగ, నెమలి రకం కోడి పుంజులు పందేలకు పెట్టింది పేరు.  … Read more

    కుప్పంలో రెండో రోజు బాబు పర్యటన; ఏం జరుగుతుందో?

    టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. పర్యటన తొలి రోజు పోలీసుల నుంచి అడుగడుగునా [ఆంక్షలు](url) ఎదుర్కొన్నారు. నేడు ఆయన నియోజకవర్గంలో ఎలా, ఎక్కడ పర్యటిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఓ వైపు ఈ రోజు మొత్తం పార్టీ కేడర్‌తో భేటీకి కేటాయించారు. బూత్‌ల వారీగా కార్యకర్తలతో సమావేశం అవుతారు. కాగా చంద్రబాబుకు సంబంధించిన ప్రచార రథాన్ని కుప్పం పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. Police deny permission for #ChandrababuNaidu#Chandrababu angrily questioned, "I am the … Read more

    వైసీపీ కోసం 70 ఎకరాలు అమ్ముకున్నా; జెడ్పీటీసీ ఆవేదన

    వైఎస్సార్‌సీపీ కోసం 70 ఎకరాలు అమ్ముకున్నానని ఓ ప్రజాప్రతినిధి వాపోయాడు. ఏపీలోని పల్నాడు జిల్లా బెల్లంకొండ జెడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఉన్న 120 ఎకరాల్లో 70 ఎకరాలు అమ్ముకుని పార్టీకి ఖర్చు చేసినా తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు. తన భార్య నగలు తాకట్టు పెట్టి థియేటర్‌లో [‘యాత్ర](url)’ మూవీ ఆడించానని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేకు తన గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేదన్నారు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని వాపోయారు. Future … Read more