• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హోమంత్రి ఇంట్లోకి వరద నీరు

    ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు గజగజ వణికిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. హర్యానాలో వరదలు కాలనీలను ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర హోం మంత్రిని కూడా వరదలు వదల్లేదు. అంబాలాలో ఉంటున్న హోం మంత్రి అనిల్ విజ్‌ ఇంట్లోకి వరద నీరు చేరింది. దీంతో ఆయన బయటకు కదలలేకుండా లోపలే ఉండాల్సి వస్తోంది. మరోవైపు, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లలోనూ వరదలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారాయి. హర్యానాలో బీజేపీ హోం మినిస్టర్ ఇంట్లోకి వరద నీరు అంబాలా – హర్యానాలో కురుస్తున్న భారీ … Read more

    ఉత్కంఠరేపిన విమానం ల్యాండింగ్

    హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ (HAL)కు చెందిన ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌ రన్‌వేపై ప్రమాదకరంగా ల్యాండ్‌ అయ్యింది. ల్యాండింగ్‌ సమయంలో విమానం ముందు భాగం రన్‌వేను తాకి కొంతదూరం అలాగే ముందుకెళ్లింది. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. HAL ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం తిరిగి HAL ఎయిర్‌పోర్ట్‌లోనే ల్యాండ్ అయ్యింది. Extremely well executed wheel in abnormal position landingAt Bangalore HAL airport, today … Read more

    మనాలిలో వరద బీభత్సం

    హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 12కు పైగా బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 80 మందికి పైగా మృతి చెందారు. మనాలిలో వరద బీభత్సం సృష్టించింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. వరదతో కొట్టుకు వచ్చిన వ్యర్థాలతో పరిసరాలు నిండిపోయాయి. రోడ్డు రవాణా పూర్తిగా స్తంభించింది. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నందున పరిస్థితి మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. #WATCH | Aftermath of the flood that ravaged Manali in Himachal Pradesh … Read more

    నృత్యంతో ఆకట్టుకున్న భాజపా ఎంపీ

    బాలీవుడ్ న‌టి, బీజేపీ ఎంపీ హేమమాలిని తన కళాత్మక ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఉత్త‌రాఖండ్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆమె పార్వ‌తీమాత గెట‌ప్‌లో నృత్య ప్ర‌ద‌ర్శ‌న చేశారు. హేమమాలిని డ్యాన్స్‌ ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వహించిన కల్చరల్‌ ఈవెంట్‌లో ఆమె ఈ క్లాసికల్‌ డ్యాన్స్‌ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ ధామీ కూడా పాల్గొన్నారు. #WATCH | Dehradun, Uttarakhand: CM Pushkar Singh Dhami participated in the cultural evening program … Read more

    రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

    ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును పాఠశాల బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. ఘాజీపూర్ నుంచి రాంగ్ రూట్లో వెళ్తున్న పాఠశాల బస్సు SUV కారును ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎనిమిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. ఆ బాలుడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. If this school bus driver … Read more

    ఉత్తరాదిని వణికిస్తున్న వరదలు

    ఉత్తరాదిని వరదలు వణికిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో అతి భారీ వరద ముప్పు ఉందని ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యాణా రాష్ట్రాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. నదులు, వాగులు పొంగి భవనాలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 28 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో 243 మి.మీ వర్షపాతం నమోదైంది. మరో వైపు యమునా నది ఉగ్రరూపం దాల్చి ముంచెత్తడానికి సిద్ధమవుతోంది. Pray for Himachal Pradesh Monsoon rains … Read more

    కాలనీలను ముంచెత్తిన బురద

    హిమాచల్ ప్రదేశ్ మండిలో వరద బీభత్సం సృష్టించింది. చెట్ల దుంగలు, బురద కాలనీలను ముంచెత్తాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సీఎం సుక్విందర్ సింగ్ సుఖు కోరారు. రానున్న 24 గంటల్లో తీవ్ర వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని హెచ్చరించారు. అత్యవసరమైతే ప్రజలు 1100, 1070, 1077 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు. #WATCH | Mandi, Himachal Pradesh | Cloud burst in Thunag causes flash … Read more

    ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు, వరదలు

    భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌, జమ్ము కశ్మీర్‌లో నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. చీనాబ్, యమున, బియాస్ నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఇప్పటికే వర్షాలు, వరదల కారణంగా 19 మంది మరణించారు. చాలా మంది వరదల్లో చిక్కుకుపోయి సహాయం కోసం అర్థిస్తున్నారు. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ వానలు ఆగట్లేదు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. #WATCH | Under the impact of incessant rainfall in Himachal Pradesh, Lagghati … Read more

    బ్యాలెట్ బాక్సు చేతపట్టుకుని పరుగో పరుగు!

    పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు దుండగులు పోలింగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను పట్టుకుని రోడ్లపై పరుగులు తీస్తూ కెమెరాకు చిక్కడం సంచలనమైంది. నేటి ఉదయం పోలింగు మొదలు కొని పలు చోట్ల విధ్వంసం, హత్యలు వంటి ఘటనలు చోటుచేసుంటూనే ఉన్నాయి. పకడ్బందీగా పోలీసులు పహారా కాస్తున్నప్పటికీ అల్లరిమూకలు మాత్రం హింసలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇప్పటివరకు ఈ ఘటనల్లో 9 మంది మృతి చెందారు. Video of person running with … Read more

    వరదలో కొట్టుకుపోయిన కార్లు

    హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌లను వరదలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్‌లో భారీ వర్షాలకు అయిదుగురు మృతి చెందారు. మనాలీలో వరద ప్రవాహంలో పలు కార్లు కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్‌లో ఓ కారు.. గంగా నదిలో పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. జమ్మూ-కశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో బస్సుపై కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. Several cars washed away in Manali#HimachalPradesh pic.twitter.com/IcJmdIJ0mn — Weatherman Shubham (@shubhamtorres09) July … Read more