• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోలుకుంటున్న తారకరత్న; ఎంపీ విజయసాయిరెడ్డి

    నందమూరి తారకరత్న కోలుకుంటున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. బెంగళూరులోని హృదయాలయ ఆస్పత్రికి వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని విజయసాయి తెలుసుకున్నారు. బాలకృష్ణ అక్కడే ఉండి తారకరత్నను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని చెప్పారు. కాగా తారకరత్నకు విజయసాయిరెడ్డి మామ వరుస అవుతారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి విజయసాయిరెడ్డి పెదనాన్న అవుతారు. విజయసాయిరెడ్డి భార్య సునంద చెల్లెలి కూతురే అలేఖ్య.

    సీఎం జగన్‌ VS వైసీపీ ఎమ్మెల్యే

    రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున తాను పోటీ చేయదలుచు కోలేదని ఏపీలోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్ది బాంబు పేల్చారు. వైఎస్సార్‌సీపీ నేతలు, ఇంటిలిజెన్స్ అధికారులను ఆయన విమర్శించారు. తన ఫోన్ సీఎం జగన్ [ట్యాపింగ్ ](url)చేయిస్తున్నారని ఆరోపించారు. కొద్ది రోజులుగా తనపై ఇంటిలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని చెప్పారు. అనుమానం ఉన్న చోట ఉండాలని తనకు లేదన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయాలని ఉందని పేర్కొన్నారు. 35 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు ఇద్దరు మంత్రులు నాకు … Read more

    ఏపీ రాజధాని వైజాగే; సీఎం వైఎస్ జగన్

    ఏపీ [రాజధాని](url) విశాఖపట్నమేనని ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో జగన్ మాట్లాడారు. ‘‘వైజాగే ఏపీ రాజధాని. అక్కడి నుంచే పరిపాలన చేపడతాం. త్వరలో నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నా. మార్చి 3, 4 తేదీల్లో ఇన్వెస్టర్ల సదస్సు వైజాగ్‌లోనే జరగనుంది. ఇన్వెస్టర్లు ఎవరైనా సరే అక్కడికి రావొచ్చు. పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం.’’ అంటూ పేర్కొన్నారు. I invite you … Read more

    మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు; వీడియో వైరల్

    కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మంచులో ఆడుకున్నారు. జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్‌లో వీరిద్దరూ స్నో బాల్స్‌తో సరదాగా ఫైట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ తన సోదరి ప్రియాంకపై స్నో బాల్స్ విసరడం, మళ్లీ ప్రియాంకం రాహుల్‌పై మంచు గడ్డలు విసురుకున్నారు. మంచుగడ్డల్లో వారిద్దరూ చిన్న పిల్లల్లా మారిపోయారు. ఒకరిపై ఒకరు మంచు విసురుకుంటూ సరదాగా గడిపారు. Sheen Mubarak!? A beautiful last morning at the #BharatJodoYatra … Read more

    మైక్‌ లాక్కున్న సీఎం బసవరాజ్‌ బొమ్మై

    [VIDEO](url):కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఓ కార్యక్రమంలో స్వామిజీ నుంచి మైక్‌ లాక్కున్నారు. బెంగళూరు మహదేవపురలో గురువారం ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో ఈశ్వరానందపురి స్వామి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో సమస్యలను ప్రస్తావించారు. రాజకీయ నాయకులే దీనికి కారణమంటూ మాట్లాడారు. వెంటనే అదే వేదికపై ఉన్న సీఎం మైక్‌ లాక్కుని…తాను హామీలిచ్చే సీఎంను కాదని నిధులిచ్చే సీఎంను అంటూ జవాబిచ్చారు. #WATCH | Karnataka CM takes mic from seer Eshwaranandapuri Swami during … Read more

    ఆ అమ్మాయి అయితే ఒకే: రాహుల్

    తన పెళ్లిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదని తెలిపారు. కొద్దిగా ఇంటిలిజెంట్ అయి ఉండాలని కండీషన్ పెట్టారు. తమ అమ్మా, నాన్నలది కూడా ప్రేమ వివాహమేనని, పెళ్లికి తాను వ్యతిరేకం కాదని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్ ఈ విషయాలను వెల్లడించారు. తాను పర్యటించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఫుడ్ చాలా కారంగా అనిపించిందని చెప్పారు. అంత ఎక్కువ కారం ఎక్కడా తినలేదని రాహుల్ సరదాగా వ్యాఖ్యానించారు.

    బ్రిటన్ పీఎం రిషి సునాక్‌కు ఫైన్

    బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు లాంక్‌షైర్ పోలీసులు జరిమానా విధించారు. కారులో [సీటు బెల్టు](url) ధరించకుండా ప్రయాణించినందుకు రూ.10 వేల (100 పౌండ్లు) జరిమానా విధించారు. ప్రధాని అయ్యి ఉండి సీటు బెల్టు పెట్టుకోకుండా ఎలా ప్రయాణిస్తారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కాగా యూకే చట్టాల ప్రకారం కారులో ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా సీటు బెల్టు ధరించాలి. లేదంటే 100 పౌండ్ల ఫైన్ చెల్లించాలి. కోర్టు వరకు వెళ్తే 500 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. Does he know how awfully patronising he comes across? … Read more

    ఔను వాళ్లిద్దరు కలిసిపోయారు; రేవంత్‌తో కోమటిరెడ్డి భేటీ

    కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యాడు. దాదాపు ఏడాది తర్వాత కోమటిరెడ్డి [గాంధీభవన్‌](url)లో అడుగు పెట్టాడు. భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడాడు.‘‘రేవంత్‌తో నాకు విభేదాలు లేవు. కాంగ్రెస్ బలమైన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలపై సమష్టిగా పోరాడుతాం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు 40 నుంచి 50 సీట్లు వస్తాయి.’’ అంటూ పేర్కొన్నాడు. #Telangana #congress senior leader #komatireddyvenkatreddy met #tpcc chief @Revanthreddy in #Gandhibhavan after … Read more

    మేము స్నేహితులం; బండి సంజయ్ కొడుకు బాధితుడు

    బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్, తాను ఇప్పటికీ స్నేహితులమేనని బాధితుడు శ్రీరామ్ చెప్పుకొచ్చాడు. భగీరథ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని.. తాము స్నేహంగా ఉంటున్నామని పేర్కొన్నాడు. తమ మధ్య బేధాభిప్రాయాలు సృష్టించేందుకే ఆ [వీడియో](url) బయట పెట్టారన్నాడు. ఆ వీడియో ఎందుకూ పనికిరాదని తెలిపాడు. కాగా మహీంద్రా వర్సిటీకి చెందిన శ్రీరామ్‌పై బండి భగీరథ్ దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై బాధితుడు మరో వీడియో రిలీజ్ చేశాడు. https://www.eenadu.net/videos/playVideo/bandi-sanjay-son-attack-victim-released-video-regarding-case/1/33525

    రాహుల్ పాదయాత్రలో భద్రతా వైఫల్యం

    [VIDEO:](url) భారత్ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. పంజాబ్‌లో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీని అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి హత్తుకునే ప్రయత్నం చేశాడు. దీంతో రాహుల్ పక్కన ఉన్న నేతలు ఆ వ్యక్తిని దూరంగా తోసేశారు. వీటిని పట్టించుకోకుండా రాహుల్ గాంధీ ముందుకు నడిచారు. అయితే, రాహుల్ గాంధీ భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కల్పిస్తున్న జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత సరిపోవట్లేదని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. 1984లో రాజీవ్ గాంధీ సిక్కుల ఊచకోతకు ఆదేశించినట్లు పుకార్లు వచ్చాయి. ఈ … Read more