• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కొండపోచమ్మసాగర్‌ను పరిశీలించిన పంజాబ్ సీఎం

    [వీడియో;](url) పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. సిద్ధిపేట జిల్లాలో ఉన్న గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మసాగర్‌ను ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండపోచమ్మ పంపు హౌజ్, తొగుటలోని మల్లన్నసాగర్, గజ్వేల్ పాండవుల చెరువు, నర్సన్నపేట చెక్‌డ్యామ్‌లను భగవంత్ సందర్శించనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుని సీఎం కేసీఆర్‌తో సమావేశమవుతారు. ਤੇਲੰਗਾਨਾ ਵਿਖੇ ਡੈਮ ਦਾ ਨਿਰੀਖਣ ਕਰਨ ਮੌਕੇ CM #BhagwantMann ਜੀ Live https://t.co/Q30FL560qO — AAP Punjab (@AAPPunjab) February 16, 2023

    సీఎం జగన్‌ను కలసిన ఆస్ట్రేలియా ఎంపీలు

    ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆస్ట్రేలియా ఎంపీలు కలిశారు. ఏపీ ప్రభుత్వ పాలనపై వారు [ప్రశంసలు](url) కురిపించారు. సోమవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రితో వారు సమావేశమయ్యారు. లేబర్ పార్టీ ఎంపీలు లీ టర్మలీస్, మాథ్యూ ఫ్రెగోన్ తదితరులు సీఎంతో సమావేశమై ఎనర్జీ, పునరుత్పాదకతపై చర్చించారు. ఈ విషయంలో పరస్పర సహాయం అందించుకోవాలని నిర్ణయించారు. ఏపీలోని పాఠశాలల్లో వస్తున్న మార్పులు అద్భుతమని ఆసీస్ ఎంపీలు కొనియాడారు. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, స్వదేశంలో తాము ఆశిస్తున్న లక్ష్యాల్లో సారూప్యత ఉందన్న ఎంపీలు … Read more

    దేశం కోసమే బతుకుతున్నా; పీఎం మోదీ

    తాను[ దేశం](url) కోసమే బతుకుతున్నానని.. అవసరమైతే దేశం కోసం ప్రాణాలు త్యాగం చేస్తానని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యసభలో మోదీ ఉద్వేగానికి గురవుతూ ప్రసంగించారు. కొంతమంది కుటుంబం కోసమే బతుకుతున్నారని.. కానీ తాను మాత్రం దేశం కోసమే బతుకుతున్నానని పేర్కొన్నారు. దేశంలో ఒకే వ్యక్తి చాలా మందిని ఎదుర్కొంటున్నాడని చెప్పారు. కాంగ్రెస్‌కు నినాదాలే కరువయ్యాయని.. కొత్త నినాదాలు వెతుక్కోవాలని ఎద్దేవా చేశారు. భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు. #WATCH | Nation is watching how an individual is strongly … Read more

    మంత్రి రోజా చెప్పులు మోసిన అధికారి

    ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి పర్యటనలో జరిగిన సంఘటన విమర్శలకు దారితీస్తోంది. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ పర్యటనలో.. ఓ ఉద్యోగి ఆమె చెప్పులు మోశారు. బీచ్‌కు వెళ్లిన మంత్రి తన చెప్పులు అక్కడ వదిలేసి ఇసుకలోకి వెళ్లారు. మేడం గారి చెప్పులు జాగ్రత్త అంటూ ఆమె పీఏ.. అక్కడి పర్యాటక శాఖ ఉద్యోగులను ఆదేశించారు. దీంతో పర్యాటక శాఖ ఉద్యోగి ఒకరు ఆమె చెప్పులను జాగ్రత్తగా పట్టుకుని నిల్చున్నారు. ఈ వీడియోపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    కార్యకర్తలతో చిందులేసిన రేవంత్ రెడ్డి

    హాత్ సే హాత్ జోడో యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో కార్యకర్తల్లో జోష్ నింపేందుకు పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రేవంత్.. గిరిజన కార్యకర్తలతో కలిసి కాసేపు చిందులేశారు. మహిళా కార్యకర్తలతో కాలు కదిపి కోలాహలం చేశారు. దీంతో పాదయాత్ర చేస్తున్న నాయకుల్లో ఉత్తేజం కలిగింది. అనంతరం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎల్లంపేట, మరిపెడ, కుడియా, ఇస్లా తండాల్లో పర్యటించారు. Revanth Reddy Dance along with Banjara … Read more

    ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు

    ఏపీలోని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి [గుండెపోటు](url)కు గురయ్యారు. వెంటనే ఆయనను కుటుంబసభ్యులు, కార్యకర్తలు నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఆయన గుండెలో రెండు వాల్వులు మూసుకుపోయినట్లు డాక్టర్టు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను చెన్నై తరలించారు. కాగా చంద్రశేఖరరెడ్డి ఉదయగిరి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ తరఫున ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. https://www.instagram.com/reel/CoZQ9c2Mwug/?utm_source=ig_web_copy_link

    కేసీఆరే నాకు స్ఫూర్తి; కుమారస్వామి

    తన తండ్రి హెచ్‌డీ దేవెగౌడ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ నాకు స్ఫూర్తి అని కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. తాజాగా రాయచూర్‌లో జరిగిన పంచరత్న [రథయాత్ర](url)లో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో కేసీఆర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. మిషన్ భగీరథ ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టి దాదాపు 14 జిల్లాలకు నీరు అందిస్తున్నారని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే తెలంగాణ తరహా పాలన అందిస్తానని పేర్కొన్నారు. #Telangana like schemes will be implemented … Read more

    లోకేశ్ పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత

    తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన [యువగళం](url) పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోకేశ్ ప్రచార రథాన్ని పోలీసులు సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని క్లాక్ టవర్ కూడలిలో ప్రజలను ఉద్దేశించి లోకేశ్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. లోకేశ్ ఉపయోగిస్తున్న వాహనానికి అనుమతి లేదని సీజ్ చేసిన పోలీసులు.. స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్రహించిన తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. కాసేపటి తర్వాత పోలీసులు రథాన్ని విడిచిపెట్టారు. ప్రచార వాహనాలను సీజ్ చేయటంతో పోలీసులను ప్రశ్నించిన … Read more

    సీఎం కేసీఆర్‌కు షర్మిల సవాల్

    వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో తనతోపాటు కేసీఆర్ కూడా [పాదయాత్ర](url) చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒక వేళ ప్రజా సమస్యలుంటే కేసీఆర్ సీఎం పదవి వదిలి రాజకీయ సన్యాసం తీసుకోవాలని.. సమస్యలు లేకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయని.. కానీ కేసీఆర్, కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. #WATCH | Today I challenge Telangana CM KCR to walk … Read more

    ‘దేశంలోనే బెస్ట్ సీఎం జగన్’

    భారతదేశంలోనే వైఎస్ జగన్ గొప్ప సీఎం అని ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ అన్నారు. నిక్ ప్రస్తుతం ఏపీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా [సీఎం జగన్‌](url)ను కలిశారు. అనంతరం రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు చూసి నిక్ స్పందించారు.‘‘రాష్ట్రంలో విద్యారంగం తీరు అద్భుతంగా ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమావ అవకాశాలు కల్పిస్తున్నారు. జగన్ లాంటి వ్యక్తిని నేనింత వరకూ చూడలేదు. ఉన్నత ఆశయంతో పని చేస్తున్నారు.’’ అంటూ కొనియాడారు. మఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను కలవడం గౌరవంగా … Read more