• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రంగస్థలానికి మించిన క్యారెక్టర్ అది: రామ్‌చరణ్

    రంగస్థలంలో రామ్‌చరణ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. యాక్టింగ్ ఇరగదీశేశాడు. అయితే, అంతకుమించిన పర్ఫార్మెన్స్‌ని చూడబోతున్నాం. ప్రస్తుతం RC15 సినిమా చేస్తున్నాడు చెర్రీ. ఈ సినిమా అనంతరం రామ్‌చరణ్ ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చేయనున్నాడు. ఈ మూవీలో తన క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుందని, రంగస్థలం సినిమాను మించి ఉంటుందని చెప్పాడు. సెప్టెంబర్ నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నట్లు వెల్లడించాడు. ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్’‌లో పాల్గొన్న చరణ్ ఈ విషయాన్ని చెప్పడంతో ఒక్కసారిగా చర్చ ఊపందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. … Read more

    అభిమానుల కోసం ఎన్టీఆర్: విశ్వక్‌సేన్

    అభిమానుల కోసం ఎన్టీఆర్ ఏదైనా చేస్తారని నటుడు విశ్వక్‌సేన్ కొనియాడాడు. ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌‌ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ‘ఓ రోజు తారక్ అన్న ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు. సొంత తమ్ముడిలాగా చూసుకున్నాడు. కారు దాకా వస్తుంటే చివరగా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రావాలని అడిగా. తప్పకుండా అంటూ మాటిచ్చేశాడు. ఇచ్చిన మాట కోసం ఆస్కార్ నుంచి నేరుగా వచ్చేశాడు. నిద్ర లేకున్నా అభిమానుల కోసం రావడం గొప్ప విషయం’ అంటూ విశ్వక్‌సేన్ చెప్పుకొచ్చాడు. మార్చి … Read more

    తెలుగు స్థాయిని కొనసాగించాలి: ఎన్టీఆర్

    ఉన్నతంగా ఉన్న తెలుగు సినిమా స్థాయిని అలాగే కాపాడుకోవాలని ఎన్టీఆర్ పిలుపునిచ్చాడు. విశ్వక్‌సేన్ లాంటి నటులు తెలుగు సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఎన్టీఆర్ ఆశించాడు. ‘విశ్వక్‌సేన్ నటించిన ఈ నగరానికి ఏమైంది సినిమా నాకెంతో ఇష్టం. నటుడిగా విశ్వక్ ప్రతిభ, డైరెక్టర్‌గా ఆత్మవిశ్వాసం నన్ను ఆకట్టుకుంటాయి. తెలుగు సినిమాకు విశ్వక్‌లాంటి నటుల అవసరం ఉంది’ అని ‘దాస్‌ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చెప్పాడు. Courtesy Twitter:VamsiShekhar Courtesy Twitter: Courtesy Twitter:@UrsVamsiShekar Courtesy Twitter:

    ‘రానాానాయుడు’పై సీనియర్ నటుడి ఫైర్

    దగ్గుబాటి వెంకటేశ్, రాణా నటించిన ‘రానానాయుడు’ వెబ్‌సీరీస్‌పై సీనియర్ నటుడు శివకృష్ణ పరోక్షంగా విమర్శిం చారు. ‘‘ఇటీవలే ఓ వెబ్ సీరీస్ చూశా. అది ఒక బ్లూఫిల్మ్ లాగే ఉంది. ఆ సినిమాను ఫ్యామిలీతో కలసి చూడలేం. ఇలాంటి దారుణ సినిమాను నేనెప్పుడూ చూడలేదు. దేశం ఆర్థికంగా పతనమైనా కోలుకుంటుంది.. కానీ సంస్కృతి పరంగా పతనమైతే కాపాడలేం. సెన్సార్ బోర్డు సభ్యుడిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నా ఓటీటీలకు కూడా సెన్సార్ ఉండాలి.’’ అంటూ పేర్కొన్నారు.

    ఆ డైరెక్టర్ వ్యాఖ్యలు దురదృష్టకరం; నాని

    ‘కేజీఎఫ్‌’ సినిమాపై టాలీవుడ్ దర్శకుడు వెంకటేశ్ మహా వ్యాఖ్యలు దురదృష్టకరమని న్యాచురల్ స్టార్ నాని అన్నారు. ‘దసరా’ మూవీ ప్రమోషన్లలో భాగంగా నాని స్పందించారు.‘‘నలుగురు దర్శకులు పాల్గొన్న చర్చా కార్యక్రమం చూశా. వెంకటేశ్ మాట్లాడిన విధం బాగా లేదు. అందుకే అతడు విమర్శలు ఎదుర్కొన్నాడు. అక్కడున్న నలుగురు దర్శకులు నాకు తెలిసిన వాళ్లే. చిన్న వీడియో క్లిప్ చూసి ఒక అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు. ఇలా జరగడం దురదృష్టకరం.’’ అంటూ నాని పేర్కొన్నాడు

    వర్జినిటీపై కామెంట్స్ చేసిన సింగర్ చిన్మయి

    [VIDEO:](url) ఫెమినిజంపై గళమెత్తే సింగర్ చిన్మయి తాజాగా వర్జినిటీ గురించి వివరించింది. తొలి కలయికలో అమ్మాయిలపై అబ్బాయిలు పెట్టుకునే అపోహలను ఖండించింది. యోని టైట్‌గా ఉంటేనే, బ్లీడింగ్ అయితేనే వర్జిన్ అని భావించడం సరైంది కాదని చిన్మయి సూచించింది. వాస్తవానికి తొలి కలయిక సమయంలో నొప్పి పుడితే, ఇతర ఇబ్బందులు కలిగితే వైద్యులను సంప్రదించాలని చిన్మయి సూచించింది. వర్జినిటీ గురించి ఓపెన్‌గా మాట్లాడటంలో మొహమాటం పడకూడదని తెలిపింది. కాగా, చిన్మయి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. https://www.instagram.com/reel/Cp2TEetukwg/?utm_source=ig_web_copy_link

    హైదరాబాద్‌కు చేరుకున్న RRR బృందం

    ‘ఆర్ఆర్ఆర్’ బృందం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి చేరుకుంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దంపతులు, ఎం.ఎం.కీరవాణి దంపతులు, కార్తికేయ, శ్రీసింహా తదితరులు స్వదేశానికి తిరిగొచ్చారు. దీంతో ఎయిర్‌పోర్టులో అభిమానులు వీరిని చుట్టుముట్టారు. మరోవైపు, రామ్‌చరణ్ కూడా ఈరోజు సాయంత్రం దిల్లీలో జరిగే ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్‌’ కార్యక్రమంలో చరణ్ అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో రామ్‌చరణ్ భేటీ కానున్నారు. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే.

    KAVYA KALYAN RAM: నటన సరే.. మరి అక్కడ రాణిస్తుందా?

    ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసిన ఓ హీరోయిన్‌ గురించే చర్చ. ఆమె ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చింది? అంటూ ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరో కాదు కావ్య కల్యాణ్ రామ్. బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కావ్య…మసూద, బలగం సినిమాలతో హీరోయిన్‌గా మారి గుర్తింపు తెచ్చుకుంది.  అచ్చమైన తెలుగమ్మాయి హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ తెలుగమ్మాయి నాగార్జున హీరోగా వచ్చిన స్నేహమంటే ఇదేరా చిత్రంతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. గంగోత్రి, ఠాగూర్‌, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్‌, … Read more

    #AskNani: ఫ్యాన్‌కు నాని  స్ట్రాంగ్ కౌంటర్… మళ్లీ చెబుతున్నా  KGF, దసరా ఒకటి కాదు.. ఒరిజినల్ పీస్

    దసరా చిత్రంతో అభిమానులకు మాస్‌ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు నాని. మార్చి 30న మెుదలవుతున్న మాస్‌ జాతర కోసం సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావటంతో సినిమాపై సూపర్‌ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రచారంలో బిజీగా ఉన్న నేచురల్ స్టార్… ట్విటర్‌లో  అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఓసారి వాటిపై లుక్కేయండి. దసరా రన్‌టైమ్‌ #Asknaniలో భాగంగా దసరా చిత్రం రన్‌ టైమ్ రివీల్‌ చేశాడు నాని. ఈ చిత్రంలో బాగా హై ఇచ్చే సీన్ ఏదంటూ … Read more

    సీతారాములే మా బలం: రామ్‌చరణ్

    [VIDEO:](url) ఉపాసనతో ఎక్కడికి వెళ్లినా ఓ చిన్న రామాలయాన్ని వెంట తీసుకెళ్తానని రామ్‌చరణ్ వెల్లడించాడు. ఈ ఆలయం తమతో ఉంటే కొండంత ధైర్యంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి దైవకృపే కారణమని తెలిపాడు. ‘ఉదయం ప్రార్థనలతోనే మాకు రోజు ప్రారంభం అవుతుంది. ఇది మా సంప్రదాయం. భారతీయులమని మాకు గుర్తు చేస్తుంది. శక్తిని ప్రసాదిస్తుంది. ఇలా చేయడాన్ని కృతజ్ణతగా భావిస్తాం’ అని చెప్పాడు. చెర్రీ ఎక్కువగా అయ్యప్ప మాలను ధరిస్తుంటాడు. తరుచుగా ఆలయాలకు వెళ్తుంటాడు. అమెరికాకు వెళ్లినా సనాతన ధర్మాన్ని … Read more