• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆస్కార్ బరిలో ‘కళాతపస్వి’ చిత్రం

    దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) వృద్ధ్యాప్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఎన్నో టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలను నిర్మించారు. అగ్ర కథానాయకులకు ఆయన దర్శకత్వం వహించి ఎన్నో ఆణిముత్యాలను ఇండస్ట్రీకి అందించారు. వాటిలో ‘స్వాతిముత్యం’, ‘సాగరసంగమం’, ‘శంకరాభరణం’, ‘ఆపద్భాంధవుడు’, ‘శృతిలయలు’, ‘సిరివెన్నెల’, ‘స్వరాభిషేకం’, ‘నేరము-శిక్ష’, వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. [‘స్వాతిముత్యం’](url) సినిమా 59వ ఆస్కార్ చిత్రాల బరిలో నిలిచింది. Telugu audience can never forget Kamal Hassan's role as an autistic individual in #SwathiMuthyam Only … Read more

    సౌండ్ ఆర్టిస్ట్ టు లెజండరీ డైరెక్టర్

    కళాతపస్వి, లెజండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ (92) వృద్ధాప్యంతో మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన స్వస్థలం ఏపీలోని బాపట్ల జిల్లా పెదపులివర్రు. గుంటూరు హిందు కాలేజీలో ఇంటర్, ఏసీ కాలేజీలో డిగ్రీ చదివారు. అనంతరం చెన్నై వెళ్లి విజయవాహినీ స్టూడియోలో సౌండి రికార్డిస్ట్‌గా కెరీర్ ఆరంభించారు. 1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాకు దర్శకుడిగా మారాడు. తొలి చిత్రానికే ‘నంది’ అవార్డు అందుకున్నాడు. ఆయన 9 బాలీవుడ్ సినిమాలతో కలిపి మొత్తం 50కి పైగా సినిమాలకు దర్శకత్వం చేపట్టారు.

    యశ్ ఇంటి ముందు ఫ్యాన్స్ బారులు

    కేజీఎఫ్‌ హీరో యశ్‌ ఇంటిముందు [ఫ్యాన్స్](url) బారులు తీరారు. అభిమాన నటుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వారిని నిరాశ పరచొద్దని భావించిన యశ్.. ప్రతి ఒక్కరితో ఓపికగా ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ కన్నడ సూపర్‌ స్టార్ ఇప్పటివరకు కొత్త సినిమా ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. జనవరి 8న తన పుట్టినరోజు కూడా ఎలాంటి అప్డేట్‌ లేదు. అప్పుడు విదేశాల్లో ఉండగా.. తిరిగి రావటంతో ఫ్యాన్స్ తరలివచ్చారు. Fans Came to Meet … Read more

    పవన్ ఎపిసోడ్; ‘ఆహా’కు టెన్షన్

    నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోకు సంబంధించి పవన్ ఎపిసోడ్ నేడు స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ [ఆహా](url)లో ప్రసారం అవుతుంది. ఈ ఎపిసోడ్‌కు దాదాపు 2 మిలియన్ల మంది యూజర్ల ట్రాఫిక్ ఉండొచ్చని ఆహా అంచనా వేస్తోంది. ఈ క్రమంలో సర్వర్ క్రాష్ అవ్వకుండా ఆహా ముందు జాగ్రత్తగా ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. అదనపు సర్వర్లు ఏర్పాటు చేసుకుంటోంది. సర్వర్ థ్రెషోల్డ్‌లను మరింత మెరుగుపరుస్తోంది. ఫోకస్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసింది. Server threshold pencham, Backup servers pedutunnam … Read more

    దుబాయ్‌లో విజయ్, రష్మిక?

    విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట మరోసారి వార్తల్లో నిలిచింది. వీరిద్దరూ కలిసి దుబాయ్‌ ట్రిప్‌కి వెళ్లినట్లు నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. వీటికి బలం చేకూర్చేలా విజయ్ దేవరకొండ దుబాయ్‌లో ఉన్నట్లుగా ఓ వీడియోను షేర్ చేశాడు. దుబాయ్ ఎడారుల్లో డ్రైవింగ్ చేస్తూ విజయ్ ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో రష్మికతో కలిసే వెళ్లి ఉంటాడని మాట్లాడుకుంటున్నారు. గతంలోనూ వీరిద్దరూ మాల్దీవ్స్ టూర్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. https://www.instagram.com/reel/CoFBDynIRyU/?utm_source=ig_web_copy_link Courtesy Twitter: Naga Singh … Read more

    ఆ నిర్మాత హింసించాడు: ఆశా సైని

    నటి ఆశా సైని(ప్లోరా సైని) సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో తాను ఓ నిర్మాతతో ప్రేమాయణం నడిపానని.. కానీ అదెంతో విషాద అనుభవమని ఓ వీడియో ద్వారా వెల్లడించింది. ‘నా ఫోన్ లాక్కున్నాడు. 14నెలల పాటు ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. సినిమాలు వదిలెయ్యాలని బలవంత పెట్టాడు. నా మొహం, ప్రైవేట్ భాగాలు కందిపోయేలా చితకబాదాడు. పొత్తి కడుపులో తన్నాడు’ అంటూ ఆశా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నట్లు వెల్లడించింది. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో ‘ఆశా’ క్యారెక్టర్ చేసి ఆశా సైనిగా … Read more

    ఫలించిన ‘బాలయ్య’ మంత్రం

    నందమూరి బాలకృష్ణ మృత్యుంజయ మంత్రం చదవగానే నందమూరి తారకరత్నలో కదలికలు వచ్చినట్లు సీనియర్ ప్రొడ్యూసర్, నందమూరి ఫ్యామిలీ సన్నిహితుడు తుమ్మల ప్రసన్న కుమార్ తెలిపారు. కుప్పంలో తారకరత్న అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు బాలయ్య మంత్రం చదవగానే తారకరత్న గుండె రీ ఫంక్షనింగ్ జరిగినట్లు చెప్పారు. ప్రస్తుతం తారకరత్న క్షేమంగానే ఉన్నారని వెల్లడించారు. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమాలో తారకరత్నను విలన్‌గా తీసుకోవాలని భావించారని పేర్కొన్నారు.

    తండ్రైన స్టార్ డైరెక్టర్; ఎమోషనల్ పోస్ట్

    తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తండ్రి అయ్యారు. ఆయన భార్య, నటి ప్రియా మోహన్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు అట్లీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ [వీడియో](url) పోస్ట్ పెట్టారు. ‘‘మాకు మగబిడ్డ జన్మించాడు. ఇంతకు మించిన ఆనందం మాకు మరెక్కడా లేదు. మా బిడ్డకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.’’ అంటూ పేర్కొన్నారు. కాగా అట్లీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మరో చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. They … Read more

    బ్రహ్మానందంకు పుట్టినరోజు శుభాకాంక్షలు

    హాస్యనట కిరీటీ బ్రహ్మానందం పుట్టినరోజు నేడు. 1956లో ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బ్రహ్మానందం జన్మించారు. జంధ్యాల ‘ఆహా నా పెళ్లంట’ సినిమాతో ప్రేక్షకులకు బ్రహ్మానందం దగ్గరయ్యారు. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. పద్మశ్రీ అవార్డూ ఆయనను వరించింది. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించగలరు. ఆయన చేసిన ఓ సినిమాలోని సన్నివేశాన్ని చూసి కాసేపు మీరూ నవ్వుకోండి.

    నిర్మాతపై బాలీవుడ్ నటి సంచలన ఆరోపణలు

    ప్రముఖ నిర్మాతపై బాలీవుడ్ నటి ఫ్లోరా సయానీ సంచలన [ఆరోపణలు](url) చేశారు. తనను తీవ్రమైన లైంగిక వేధింపులకు గురిచేశాడని వెల్లడించారు. “ నేను ప్రముఖ నిర్మాతను ప్రేమించాను. అంతలోనే నా పరిస్థితులు మారిపోయాయి. అతను నన్ను దుర్భాషలాడాడు. నా ముఖం, ప్రైవేటు భాగాలపై కొట్టాడు. నా ఫోన్‌ లాక్కొని బలవంతం చేశాడు. నటన మానేయాలని 14 నెలలుగా చిత్ర హింసలు పెట్టాడు. నన్ను ఎవ్వరితోనూ మాట్లాడకుండా చేశాడు. చివరికి పారిపోయి వచ్చాను” అని పేర్కొన్నారు. https://www.instagram.com/reel/CoCUfkZNUPJ/?utm_source=ig_embed&ig_rid=3fe4d192-1a4c-471a-85d7-19adbdc5ee10 Screengrab Instagram:florasaini