‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటుడు అల్లు అర్జున్. ఈ సినిమా అనంతరం ఐకాన్ స్టార్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. దీంతో క్రమక్రమంగా బన్నీ బ్రాండ్ వాల్యూ ఎక్కువైపోయింది. తాజాగా దేశంలో బ్రాండ్ వాల్యూ పరంగా టాప్ 25 సెలబ్రిటీల జాబితాలో అల్లు అర్జున్ చోటు సంపాదించాడు. పుష్పరాజ్‌తో పాటు శ్రీవల్లిగా నటించిన రష్మిక బ్రాండ్ వాల్యూ కూడా పెరిగిపోయింది. ఈ కన్నడ కుట్టికి టాప్ 25లో చోటు లభించింది. తెలుగు తేజం బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. 2022 సంవత్సరానికి గాను కన్సల్టింగ్ సంస్థ ‘క్రోల్’(kroll) ‘సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూయేషన్ స్టడీ’ని విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశంలో టాప్ 20వ సెలబ్రిటీగా నిలిచాడు. 3.14 కోట్ల డాలర్ల బ్రాండ్ వాల్యూతో టాప్ 25లో చోటు సంపాదించాడు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప2’ సినిమా షూటింగులో బిజీబిజీగా ఉన్నాడు.
పీవీ సింధు
బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఈ జాబితాలో 23వ స్థానం దక్కించుకుంది. ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ బ్రాండ్ వాల్యూ 2.65 కోట్ల డాలర్లు.
రష్మిక మందన్న
పుష్ప బ్యూటీ రష్మిక మందన్న కూడా టాప్ 25 జాబితాలో చోటు సంపాదించింది. 2.53 కోట్ల డాలర్లతో 24వ స్థానంలో నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో పలు సినిమాలతో రష్మిక బిజీబిజీగా ఉంది.
రణ్‌వీర్ సింగ్
18.17 కోట్ల డాలర్లతో రణ్‌వీర్ సింగ్ తొలి స్థానంలో నిలిచాడు. ఐదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న విరాట్ కోహ్లీని అధిగమించాడు. 2021లో రణ్‌వీర్ బ్రాండ్ వాల్యూ 15.83 కోట్ల డాలర్లు ఉండగా 2022కి 18.17కోట్ల డాలర్లకు చేరుకుంది.
విరాట్ కోహ్లీ
కెప్టెన్సీ వదులుకున్నాక విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ తగ్గిపోతోంది. 2020లో కోహ్లీ బ్రాండ్ వాల్యూ 23.77 కోట్ల డాలర్లు కాగా, 2022 సంవత్సరానికి 17.69 కోట్ల డాలర్లకు పడిపోయింది. దీంతో దేశంలో సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ జాబితాలో రెండో స్థానానికి పరిమితమయ్యాడు.
అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మూడో స్థానంలో నిలిచాడు. ఇతడి బ్రాండ్ వాల్యూ 15.36 కోట్ల డాలర్లు.
అలియా భట్
లేడీ సెలబ్రిటీల జాబితాలో దేశంలో తొలి స్థానంలో నిలిచిన నటి అలియా భట్. ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచింది. ఈ బ్యూటీ బ్రాండ్ వాల్యూ 10.29 కోట్ల డాలర్లు.
దీపిక పదుకొణె
8.29 కోట్ల డాలర్లతో దీపిక పదుకొణె 5వ స్థానంలో నిలిచింది. 2021లో 5.16 కోట్ల డాలర్లుగా ఉండేది.
ఎం.ఎస్.ధోనీ
రిటైర్మెంట్ తర్వాత బ్రాండ్ వాల్యూ కాస్త తగ్గింది. 8.03 కోట్ల డాలర్లతో ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.
అమితాబ్ బచ్చన్
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఏడో స్థానంలో నిలిచాడు. అమితాబ్ బ్రాండ్ వాల్యూ 7.9 కోట్ల డాలర్లుగా ఉంది.
సచిన్ తెందుల్కర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ బ్రాండ్ వాల్యూ అదేరీతిలో కొనసాగుతోంది. 7.36 కోట్ల డాలర్లతో సచిన్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
హృతిక్ రోషన్
7.16 కోట్ల డాలర్లతో హృతిక్ రోషన్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.
షారూక్ ఖాన్
కింగ్ షారూక్ ఖాన్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. 5.57 కోట్ల డాలర్లుతో పదో స్థానంలో నిలిచాడు.
సల్మాన్ ఖాన్
షారూక్ ఖాన్ వెంబడి సల్మాన్ ఖాన్ బ్రాండ్ వాల్యూ ఉంది. 5.45 కోట్ల డాలర్లతో 11వ స్థానం సంపాదించాడు.
రణ్‌బీర్ కపూర్
సల్మాన్ ఖాన్‌తో సమానంగా రణ్‌బీర్ కపూర్ బ్రాండ్ వాల్యూ ఉంది. 5.45 కోట్ల డాలర్లతో సల్లు భాయ్‌తో 11వ స్థానాన్ని పంచుకున్నాడు రణ్‌బీర్.
రోహిత్ శర్మ
ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్రాండ్ వాల్యూ 4.95 కోట్ల డాలర్లు. కోహ్లీతో పోల్చితే చాలా తక్కువ. మొత్తంగా జాబితాలో 13వ స్థానంలో ఉన్నాడీ హిట్ మ్యాన్.
ఆయుష్మాన్ ఖురానా
ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ వాల్యూ 4.95 కోట్ల డాలర్లు. బ్రాండ్ వాల్యూ లిస్ట్‌లో 14వ స్థానంలో ఉన్నాడీ హీరో.
అనుష్క శర్మ
సినిమాలు తక్కువ చేసినప్పటికీ అనుష్క శర్మ బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు. 4.17 కోట్ల డాలర్లతో అనుష్క 15వ స్థానంలో నిలిచింది.
కియారా అడ్వాణీ
ఇటీవలే పెళ్లి పీటలెక్కింది షేర్షా బ్యూటీ కియారా అడ్వాణీ. 3.83 కోట్ల డాలర్ల బ్రాండ్ వాల్యూతో 16వ స్థానంలో ఉంది.
కరీనా కపూర్, కార్తీక్ ఆర్యన్
కరీనా కపూర్, కార్తీక్ ఆర్యన్‌ల బ్రాండ్ వాల్యూ 3.65 కోట్ల డాలర్లు. వీరిద్దరూ కలిసి 17వ స్థానాన్ని పంచుకున్నారు.
హార్దిక్ పాండ్యా
భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 18వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఆల్‌రౌండర్ బ్రాండ్ వాల్యూ 3.48 కోట్ల డాలర్లు.
సారా, వరుణ్..
సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్ 21వ స్థానంలో ఉన్నారు. వీరిద్దరి బ్రాండ్ వాల్యూ 2.8 కోట్ల డాలర్లుగా ఉండటం విశేషం.
నీరజ్ చోప్రా
నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ 2.65 కోట్ల డాలర్లు. పీవీ సింధుతో సమానమైన బ్రాండ్ వాల్యూతో ఈ ఒలింపిక్ ఛాంపియన్ 23వ స్థానంలో ఉన్నాడు.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!