మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించి తెరకెక్కించిన సినిమా ‘దాస్ కా ధమ్కీ’. మార్చి 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది.నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా విశ్వక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టి రికార్డు సృష్టించింది.
‘దాస్ కా ధమ్కీ’ చిత్రంతో విజయం అందుకున్న విశ్వక్‌సేన్ ఈ చిత్రం సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చారు. తప్పకుండా ధమ్కీ2 తీస్తానని చెప్పాడు. ఫలక్‌నుమా దాస్ సీక్వెల్ కూడా తెరకెక్కిస్తానని వెల్లడించాడు. అయితే, వీటిలో ఏది ముందు వస్తుందో చెప్పలేనన్నాడు. సినిమాలోని కామెడీ సన్నివేశాలు చక్కగా రావడంపై దర్శకుడిగా సంతృప్తి పొందానని విశ్వక్ ఆనందం వ్యక్తం చేశాడు. డ్యుయల్ రోల్‌లో నటించడం సరికొత్త అనుభూతిని కలిగించిందని చెప్పాడు.
దర్శకుడిగా విశ్వక్ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడనే చెప్పాలి. తొలుత అంగమలై డైరీస్‌కు రీమేక్‌గా పాతబస్తీ నేపథ్యంతో తీసిన ఫలక్‌నుమా దాస్ సూపర్ హిట్ అయింది. విశ్వక్‌లోని దర్శకుడిని ఈ సినిమా పరిచయం చేసింది. దీనికి కూడా విశ్వక్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు దాస్ కా ధమ్కీ తనలోని సత్తాను చాటింది. ఈ సినిమా విడుదలకు ముందు తనను ఒక్క మెట్టు ఎక్కిస్తే అద్భుతాలు చేస్తాను అంటూ విశ్వక్ వేదికలపై మాట్లాడాడు. మరి తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అంటే దాదాపు రూ.8 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్‌తో ఓ మెట్టు ఎక్కించారనే చెప్పాలి. మరి ఎలాంటి సినిమా తీస్తాడో వేచి చూడాలి.
విశ్వక్‌కు గ్యాంగ్‌స్టర్ కథలంటే చాలా ఇష్టమని అతడి దగ్గర మంచి మంచి ఆలోచనలు ఉన్నాయని… హీరోయిన్ నివేథా పేతురాజ్ కూడా ఓ వేదికపై చెప్పింది. విశ్వక్ టాలివుడ్‌కు ‘లోకేశ్ కనగరాజ్’ అవ్వగలడని ఆమె అభిప్రాయపడింది. మరి ఈ కుర్ర హీరో, దర్శకుడిలో ఏ మేరకు ప్రతిభ ఉందో రానున్న రోజుల్లో తెలుస్తుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!