సితార బ్యానర్లో విశ్వక్ మాస్ మూవీ
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విశ్వక్సేన్ హీరోగా మాస్ సినిమా రాబోతోంది. బుట్టబొమ్మ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్మాత నాగవంశీ ఈ ప్రకటన చేశారు. విశ్వక్సేన్ మాస్ విశ్వరూపం చూడబోతున్నారని చెప్పారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఏడాదే విడుదలకు ప్లాన్ చేస్తున్నామని నాగవంశీ చెప్పారు. మాస్ కా దాస్ ట్యాగ్‌ని ప్రూవ్ చేసేలా ఉండబోతోందని తెలిపారు. వాస్తవానికి బుట్టబొమ్మ సినిమాలో తొలుత హీరోగా విశ్వక్సేన్ని అనుకున్నారట. డేట్స్ కుదరక సిద్ధుకి, ఆ తర్వాత వశిష్ఠకు కాల్ వెళ్లింది.