టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, నివేథా పేతురాజ్ నటించిన ధాస్ కా ధమ్కీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 14 నుంచి ఆహా వేదికగా వస్తోంది. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. చిత్రానికి విశ్వక్ స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల కాస్త వెనకబడిందని టాక్. మరి ఓటీటీలో చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో చూడాలి.
కృష్ణదాస్‌గా, సంజయ్ రుద్రగా విశ్వక్‌సేన్ డ్యుయల్ రోల్ చేసిన సినిమా ఇది. రెండు వేరియేషన్లను చక్కగా చూపించాడు. నెగెటివ్ రోల్‌లో మాస్ డైలాగ్స్‌తో ఇరగదీశాడు.
లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. ఇందులో రెండు పాటల శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఆల్‌మోస్ట్ పడిపోయిందే పిల్లా, మావా బ్రో.. పాటలు బాగా రీచ్‌ని సాధించాయి.
కథేంటంటే?
కృష్ణదాస్ వెయిటర్‌గా చేస్తుండేవాడు. ఒకరోజు హోటల్‌కు వచ్చిన కీర్తి(నివేదా)తో ప్రేమలో పడతాడు. తానొక సంపన్నుడినని పరిచయం చేసుకుని కొన్నిరోజులు నటిస్తాడు. అయితే, కృష్ణదాస్ గురించి కీర్తికి తెలిసిపోతుంది. అనంతరం కొన్ని కారణాల వల్ల కృష్ణదాస్ సంజయ్ రుద్రగా మారాల్సి వస్తుంది. అసలు ఈ సంజయ్ రుద్ర ఎవరు? కృష్ణదాస్‌ని పోలీ ఉండటానికి కారణం ఏంటి? అనేవి సినిమాలో చూపించారు. పూర్తి రివ్యూ కోసం కింది ఆర్టికల్‌పై క్లిక్ చేయండి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!