• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ashoka Vanamlo Arjuna Kalyanam(AVAK) Movie Review

    చాలాకాలంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం సినిమా నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. విశ్వ‌క్‌సేన్, రుక్స‌ర్ ధిల్ల‌న్ ప్రధాన పాత్ర‌ల్లో న‌టించారు. విద్యా సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ర‌వి కిర‌ణ్ కోలా క‌థ‌ను అందించాడు. ఇటీవ‌ల‌ హీరోపై వ‌చ్చిన వివాదాల‌తో సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెరిగింది. ఇది నా కెరీర్‌లో బెస్ట్ ఫ‌ర్ఫార్మెన్ అని విశ్వ‌క్ ప‌లు ఇంట‌ర్వ్యూల్లో చెప్పాడు. మ‌రి సినిమా అంచ‌నాల‌ను అందుకుందా..? ఇంత‌కీ స్టోరీ ఏంటి..? ఎలా ఉందో తెలుసుకుందాం.

    క‌థేంటంటే..

    అల్లం అర్జున్ కుమార్ (విశ్వ‌క్ సేన్‌) వ‌య‌సు 30 ఏళ్లు దాటిపోతుంది. ఇంకా పెళ్లి కాలేద‌ని ఒత్తిడి పెరుగుతుంది. పెళ్లిచూపుల్లో మాధ‌వి (రుక్స‌ర్ ధిల్ల‌న్‌) న‌చ్చుతుంది. అంతా ఓకే అనుకున్న స‌మ‌యానికి ఒక ట్విస్ట్ వ‌స్తుంది. లాక్‌డౌన్ కార‌ణంగా అర్జున్, మాధ‌వి వాళ్ల ఇంట్లో ఉండిపోవాల్సి వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో అర్జున్‌ని ఆశ్చర్యపరిచే కొత్త విషయాలు బ‌య‌ట‌కొస్తాయి మ‌రి ఇంత‌కీ రెండు కుటుంబాలు క‌లుస్తాయా..? పెళ్లి జ‌రుగుతుందా..? లేదా అనేదే క‌థ‌.

    ఎవరెలా చేశారంటే..

    30 ఏళ్లు దాటిన వ్య‌క్తిగా ఆహార్యంలో, న‌ట‌న‌లో విశ్వ‌క్ సేన్ అర్జున్ పాత్ర‌లో ఒదిగిపోయాడు. అత‌డు చెప్పిన‌ట్లు కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర‌గా ఇది మిగిలిపోతుంది. రుక్సార్ ధిల్లన్, రితికా నాయక్ ఈ చిత్రంలో ప్రధాన కథానాయికలు. ఇద్దరూ పాత్రకు తగినట్లుగా కనిపిస్తారు. ప్ర‌మోష‌న్స్‌లో రితికా ఎక్క‌డా క‌నిపించ‌న‌ప్ప‌టికీ సినిమాలో న‌ట‌న‌తో స‌ర్‌ప్రైజ్ ఇస్తుంది. ఇత‌ర న‌టీనులు కూడా ఏదో ఫ్రేమ్‌లో ఉన్నామ‌ని కాకుండా క‌థ‌లో ఇన్వాల్వ్‌ కావ‌డం ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది.

    విశ్లేష‌ణ‌

    వ‌య‌సు పెరిగిపోతున్న ఒక వ్య‌క్తి స‌మాజంలో ఎదుర్కొనే స‌మ‌స్య‌ల గురించి చూపించే ప్ర‌య‌త్న‌మే ఈ సినిమా. ఇలాంటి క‌థ‌ల‌కు స‌రైన న‌టుల‌ను ఎంచుకోవ‌డం చాలా ముఖ్యం. దాంతో పాటు అనుకున్న క‌థ‌ను తెర‌పై చూపించడం చాలా క‌ష్టం. కానీ ఈ సినిమాలో అవ‌న్నీ స‌మ‌పాళ్ల‌లో కుదిరాయి.  

    మొద‌టి భాగం మొత్తం ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా స‌ర‌దాగా సాగిపోతుంది. రెండో భాగం ప్రారంభంలో స‌న్నివేశాలు కాస్త సాగ‌దీసిన‌ట్లు అనిపించినా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ అద‌రిపోతుంది. ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యేలా తీయ‌డంలో విజ‌యం సాదించాడు డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్. చివ‌రికి ఒక ఫీల్ గుడ్ మూవీ చూశామ‌నే ఫీలింగ్ క‌లులుగుంది. 

    అక్క‌డ‌క్క‌డా కాస్త త‌డ‌బ‌డ్డా ఇత‌ర స‌హాయ‌క న‌టులు క‌థ‌ను ముందుకు న‌డిపించ‌డంలో సాయ‌ప‌డ్డారు.  గోప‌రాజు ర‌మ‌ణ‌, కాదంబ‌రి కిర‌ణ్ వంటి వాళ్ల పాత్ర‌లు ప్ర‌త్యేకంగా గుర్తుండిపోతాయి. ముఖ్యంగా మిడిల్‌క్లాస్ మెమ‌రీస్ త‌ర్వాత గోప‌రాజుకు ఈ సినిమా మ‌రో మంచి పాత్ర‌ను తెచ్చింది.

    సాంకేతిక విష‌యాలు

    జై క్రిష్ అందించిన మ‌యూజిక్ సినిమాకు మ‌రింత బ‌లం చేకూర్చింది. పాట‌ల‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్‌ను క‌లిగించింది. ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. విలేజ్ వాతావ‌ర‌ణాన్ని చ‌క్క‌గా చూపించాడు. క‌థ‌, కథనం చక్క‌గా కుదిరింది. విప్ల‌వ్ నైశాడం ఎడిటింగ్ బాగుంది. 

    బ‌లాలు

    • న‌టీన‌టులు
    • క‌థ‌
    • ర‌చ‌న‌
    • కామెడీ

    బ‌ల‌హీన‌త‌లు

    • సెకండాఫ్‌లో కొన్ని సాగ‌దీత‌ స‌న్నివేశాలు

    రేటింగ్: 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv