• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • #AskNani: ఫ్యాన్‌కు నాని  స్ట్రాంగ్ కౌంటర్… మళ్లీ చెబుతున్నా  KGF, దసరా ఒకటి కాదు.. ఒరిజినల్ పీస్

    దసరా చిత్రంతో అభిమానులకు మాస్‌ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు నాని. మార్చి 30న మెుదలవుతున్న మాస్‌ జాతర కోసం సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావటంతో సినిమాపై సూపర్‌ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రచారంలో బిజీగా ఉన్న నేచురల్ స్టార్… ట్విటర్‌లో  అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఓసారి వాటిపై లుక్కేయండి.

    దసరా రన్‌టైమ్‌

    #Asknaniలో భాగంగా దసరా చిత్రం రన్‌ టైమ్ రివీల్‌ చేశాడు నాని. ఈ చిత్రంలో బాగా హై ఇచ్చే సీన్ ఏదంటూ అభిమాని అడిగిన ప్రశ్నకు 2 గంటల 36 నిమిషాలు అలానే ఉంటుందనే సమాధానం ఇచ్చాడు. 

    ఫుల్‌ బిందాస్

    సినిమా ఔట్‌పుట్‌పై మీరు సంతోషంగా ఉన్నారా ? అడిగిన ప్రశ్నకు నాని పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ట్రైలర్‌లోని ఓ చిన్న వీడియోను జోడిస్తూ సమాధానం చెప్పాడు యంగ్ హీరో. దీంతో చిత్రం అదిరిపోతుందని చెప్పకనే చెప్పాడు. 

    స్ట్రాంగ్ రిప్లై

    రంగస్థలం, పుష్ప చిత్రాలతో పోలీస్తే దసరా సినిమాలో తేడా ఏంటీ ? నార్త్‌ ఇండియాలో కొంతమంది చిత్రాన్ని కేజీఎఫ్‌తో పోల్చి పట్టించుకోవడం లేదని తెలిపాడు ఓ అభిమాని. దీనికి నాని స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చాడు. షారుఖ్‌ ఖాన్, ఆర్నాల్డ్‌ ఒకే రకం జాకెట్ వేసుకున్నంత మాత్రాన హాలీవుడ్‌ టర్మినేటర్, బాలీవుడ్ దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే సినిమాలు ఒక్కటి కావంటూ రిప్లే ఇచ్చాడు. 

    ఫన్నీ సమాధానం

    నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చిన నాని. భలే భలే మెుగాడివోయ్‌ చిత్రం ఎప్పుడనే క్వశ్చన్‌కు నాని ఎపిక్ రిప్లై ఇచ్చాడు. సినిమా కథను గుర్తు చేస్తూ “ వాడికి గుర్తొచ్చినప్పుడు” అన్నాడు. 

    ఎవరైనా ఒక్కటే

    నేచురల్ స్టార్‌ కొత్త దర్శకులకు అవకాశాలు ఎక్కువగా ఇస్తుంటాడు. అలా కాకుండా టాప్‌ డైరెక్టర్లతో పనిచేయాలని ఓ వ్యక్తి చెప్పగా… “ టాలెంట్ కొత్తది అయితే ఏంటి? పాతది అయితే ఏంటి? తేడా తెలియట్లేదు నాకు” అంటూ చెప్పిన సమాధానాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

    ఒరిజినల్ పీస్‌

    సినిమా ట్రైలర్ చూస్తే నిజంగానే కొత్త దర్శకుడు తీసినట్లుగా అనిపించదు. చాలా అనుభవం ఉన్న వ్యక్తి చిత్రాన్ని తెరకెక్కించిన ఫీలింగ్ వస్తుంది. దీనిపై నానికి ప్రశ్నలు ఎదురయ్యాయి. “ఊహల్లో ఇప్పటికే చాలా తీసేశాడు. దొరికాడు మనకు ఒకడు, ఒరిజినల్ పీస్‌” అంటూ శ్రీకాంత్ ఓదెలను కొనియాడాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv