మిస్టరీ నవలల్లో ప్రతీ పేజీ ఒక కొత్త మలుపు, ప్రతీ పాత్ర ఒక కొత్త కోణంతో పాఠకులను అలరిస్తుంటాయి. మిస్టరీ కథలలో ఉండే సస్పెన్స్, క్లూస్, కథనంలోని అనూహ్యమైన మలుపులు పాఠకుల్ని చివరి వరకు ఆలోచనలో ముంచెత్తుతాయి.
ఇలా పాఠకులను ఆకట్టుకునే మిస్టరీ నవలలతో ఆంగ్ల పఠనాన్ని ప్రారంభించడం ఉత్తమ మార్గం. ఈ కథలు కథనంలోని నైపుణ్యాలతో పాటు,(Top 20 Mystery Novels For Beginners) భాషా నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తాయి. సరళమైన భాష, ఆసక్తికరమైన కథా గమనంతో ఇవి మొదటిసారి ఆంగ్ల నవలలను చదవబోయే వారికీ అనువుగా ఉంటాయి.
ఈ కథనంలో మేము కొత్త పాఠకుల కోసం అందుబాటులో ఉన్న టాప్ 20 మిస్టరీ నవలల జాబితాను మీకు అందిస్తున్నాము. ఇవి Amazonలో కూడా లభ్యమవుతాయి, కనుక మీరు ఈ పుస్తకాల్ని సులభంగా పొందవచ్చు. ప్రతి నవల లోతైన కథనంతో, అనూహ్యమైన మలుపులతో మిమ్మల్ని ఉత్కంఠభరితంగా ఉంచుతుంది. మీరు మిస్టరీ ప్రేమికులైనా, కొత్తగా చదవడం ప్రారంభించేవారైనా, ఈ నవలలు మీకు మంచి జ్ఞానాన్ని అందిస్తాయి.
1. The Girl with the Dragon Tattoo – Stieg Larsson
థీమ్: టెక్నాలజీ, హ్యాకింగ్, సమాజంలోని వేధింపులపై పోరాటం
ఇది లిస్బెత్ సలాండర్ అనే హ్యాకర్ మరియు జర్నలిస్ట్ మికాయెల్ బ్లూంక్విస్ట్ కలిసి ఒక కుటుంబానికి చెందిన 40 ఏళ్ల క్రితం జరిగిన మిస్టరీని చేధించే కథ. మోడరన్ టెక్నాలజీ, న్యాయవ్యవస్థలోని లోపాలను ఈ నవల సూచిస్తుంది.
2. And Then There Were None – Agatha Christie
థీమ్: మానవ మనస్తత్వం, నైతిక విలువలు
పది మంది వ్యక్తులు ఒక ద్వీపంలో వేర్వేరు కారణాలతో ఒకచోట చేరతారు. వారందరూ ఒకొక్కరుగా హత్యకు గురవుతారు. పాఠకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచే కథ ఇది.
3. Gone Girl – Gillian Flynn
థీమ్: సంబంధాల మర్మం, మోసపూరిత ప్రేమ
ఇది నిక్, ఎమీ అనే భార్యాభర్తల కథ, ఎమీ అదృశ్యమైన తర్వాత నిక్ మీద వచ్చిన ఆరోపణలు కథను ఉత్కంఠభరితంగా మార్చుతాయి. సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేమలోని చీకటి కోణాలను అన్వేషిస్తుంది.
4. The Silent Patient – Alex Michaelides
థీమ్: మౌనం వెనుక దాగిన మర్మం
మౌనంగా ఉన్న అలీషియా అనే మహిళ తన భర్తను ఎందుకు హత్య చేసిందో తేల్చడానికి ఓ థెరపిస్ట్ చేసే ప్రయత్నమే ఈ కథ. ఈ పుస్తకం మౌనంలో దాగిన భావనలను అద్భుతంగా చిత్రిస్తుంది.
5. The Da Vinci Code – Dan Brown
థీమ్: చారిత్రక రహస్యాలు, క్రైస్తవ ధర్మం
రాబర్ట్ లాంగ్డన్ అనే ప్రొఫెసర్ ప్రాచీన చిహ్నాలను డికోడ్ చేస్తూ ఒక అంతర్జాతీయ రహస్యాన్ని బయటపెడతాడు. చరిత్ర, మతం, కళ కలయిక ఈ కథను ప్రత్యేకతగా నిలిపింది.
6. Big Little Lies – Liane Moriarty
థీమ్: స్నేహం, సత్యం-అసత్యం
మాడెలైన్, సేలెస్ట్, జేన్ అనే ముగ్గురు స్నేహితుల జీవితాలను చుట్టూ తిరిగే కథ ఇది. ఒక హత్య ఎలా సంభవించిందనే దానిపై కథా మలుపులు సాగే తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
7. The No.1 Ladies’ Detective Agency – Alexander McCall Smith
థీమ్: స్త్రీ శక్తి, సామాజిక సమస్యలు
ప్రెషియస్ రమోట్స్వే అనే మహిళ బోత్స్వానాలో తన డిటెక్టివ్ ఏజెన్సీని ప్రారంభించి, ప్రజలు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలను ఎలా పరిష్కరించిందనే కథ. హాస్యంతో పాటు హృదయస్పర్శించే కథనాలతో పాఠకులను ఆకట్టుకుంటుంది.
8. Sherlock Holmes: A Study in Scarlet – Arthur Conan Doyle
థీమ్: లోతైన విశ్లేషణ, నేర పరిశోధన
షెర్లాక్ హోమ్స్ తన సహచరుడు డాక్టర్ వాట్సన్‌తో కలిసి చేసిన మొదటి కేసును పరిచయం చేసే ఈ నవల, నేరాలను విచారించడంలో హోమ్స్ వినియోగించే లోతైన విశ్లేషణలను చూపిస్తుంది.
9. The Woman in the Window – A.J. Finn
థీమ్: వాస్తవం vs భ్రాంతి మధ్య సంఘటనలు
అన్నా ఫాక్స్ అనే మహిళ తన కిటికీ నుంచి గమనించిన హత్యా సంఘటన గురించి కథ. ఆమె భయాలు, వాస్తవం మధ్య సాగే కథ పాఠకులకు ఆసక్తికరంగా ఉంటుంది.
10. The Cuckoo’s Calling – Robert Galbraith (J.K. Rowling)
థీమ్: నేరపరిశోధన
స్ట్రైక్ అనే డిటెక్టివ్ ఒక ప్రసిద్ధ మోడల్ ఆత్మహత్య వెనుక అసలు కారణాన్ని అన్వేషించే కథ. ఇందులో పదాలు సులభంగా ఉండి చదివేందుకు అనుకూలంగా ఉంటాయి.
11. In the Woods – Tana French
థీమ్: బాల్య జ్ఞాపకాలు, విచారణలో ఆత్మవిమర్శ
ఒక చిన్న గ్రామంలో ఓ బాలిక దారుణంగా హత్య చేయబడింది. ఈ కేసును అన్వేషించే డిటెక్టివ్ రాబ్ రీన్ గురించి కథ సాగుతుంది. అయితే (Top 20 Mystery Novels For Beginners)ఈ విచారణలో, అతని చిన్ననాటి భయంకరమైన జ్ఞాపకాలు తిరిగి బయటకు వస్తాయి. మిస్టరీని ఛేదించడం మాత్రమే కాకుండా, అతని వ్యక్తిగత భావోద్వేగాలను కూడా ఈ కథ లోతుగా పరిశీలిస్తుంది. ఈ నవల మానసిక సంఘర్షణలను అద్భుతంగా చిత్రీకరిస్తుంది.
12. Before I Go to Sleep – S.J. Watson
థీమ్: గుర్తు కోల్పోవడం, నమ్మక ద్రోహం
క్రిస్టిన్ అనే మహిళ ప్రతిరోజూ తన జ్ఞాపకాలను కోల్పోతుంది. ఆమెకు తెలియని ఒక ప్రపంచంలో, తనను చుట్టుముట్టిన వ్యక్తులపై నమ్మకాన్ని పెంచడం ఓ సవాలుగా మారుతుంది. ఈ పుస్తకం చివరికి ఒక అనూహమైన మలుపు తో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. పాఠకులకు భావోద్వేగ మరియు మిస్టరీ భరితమైన అనుభూతిని ఇస్తుంది.
13. The Night Fire – Michael Connelly
థీమ్: న్యాయస్థానం, పాత కేసుల పరిశోధన
హ్యారీ బోష్ అనే మాజీ డిటెక్టివ్ తన మెంటార్ మృతిచెందిన తర్వాత అతను వదిలిపెట్టిన ఒక పాత కేసును తిరిగి తెరపైకి తీసుకువస్తాడు. ఈ కథలో పురాతన న్యాయవ్యవస్థతో పాటు ఆధునిక విచారణ పద్ధతులను మిళితం చేసి ప్రదర్శించారు. కొత్తగా మిస్టరీ చదవడం ప్రారంభించే పాఠకులకు ఇది అద్భుతమైన నవల.
14. Shutter Island – Dennis Lehane
థీమ్: మానసిక అనారోగ్యం
1954లో నెలకొన్న ఈ కథలో, డిటెక్టివ్ టెడీ డానియల్స్ ఒక రోగిని కనుగొనేందుకు షట్టర్ ఐలాండ్ అనే మానసిక ఆసుపత్రికి వెళతాడు. అయితే అక్కడి పరిస్థితులు, టెడీకి ఎదురైన మలుపులు ఈ కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. మానసిక అనారోగ్యం, భ్రాంతి వాస్తవాన్ని ఎలా మలుపు తిప్పుతుందనే విషయాన్ని ఈ నవల అద్భుతంగా ఆవిష్కరిస్తుంది.
15. The Hound of the Baskervilles – Arthur Conan Doyle
థీమ్: శాస్త్రబద్దత
షెర్లాక్ హోమ్స్ ఈ కథలో ఒక పురాణ కథలతో ముడిపడిన కేసును పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాడు. బాస్కర్‌విల్లే కుటుంబంపై ఒక శాపం ఉందని స్థానికులు నమ్ముతారు. హోమ్స్ తన మేధస్సుతో ఈ మిస్టరీని ఛేదించడం ఈ నవలలోని ప్రధాన ఆకర్షణ. మిస్టరీ నవలలలో క్లాసిక్‌గా నిలిచిన ఈ పుస్తకం కొత్త పాఠకులకు మంచి పుస్తకం.
16. The Murder of Roger Ackroyd – Agatha Christie
థీమ్: మోసపూరిత స్నేహం, వాస్తవం అన్వేషణ
హర్క్యూల్ ప్యారోట్ ఈ కథలో ఒక చిన్న గ్రామంలో జరిగిన హత్యను విచారిస్తాడు. ఈ కథలో రచయిత పాఠకులను అంచనాలు వేయగలిగేలా(Top 20 Mystery Novels For Beginners) ప్రోత్సహిస్తూ, చివరికి నమ్మశక్యంకాని మలుపును అందిస్తారు. క్రిస్టీ రచనా శైలి కొత్త పాఠకులను ఎంతో ఆకట్టుకుంటుంది.
17. Behind Closed Doors – B.A. Paris
థీమ్: వ్యక్తిగత జీవితంలో భయం, భావోద్వేగాలు
జాక్, గ్రేస్ అనే కపుల్ పర్యవేక్షణలో ఉన్నట్లుగా కనిపిస్తారు. అయితే గ్రేస్ అసలు స్వేచ్ఛ లేనిదిగా జీవిస్తున్నట్లు నిజాలు వెలుగులోకి వస్తాయి. ఈ నవల మానసిక ఒత్తిడులు, సమాజం ముందున్న నకిలీ ముఖాలను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది
18. The Last Mrs. Parrish – Liv Constantine
థీమ్: అసూయ, మోసం
మేధావి అయిన దాఫ్నే పారిష్ జీవితాన్ని తస్య అనే మహిళ అసూయతో చూస్తూ, దానిని పొందడానికి కుతంత్రాలు చేస్తుంది. ఈ కథ స్త్రీల జీవితాల్లోని శక్తి, ప్రాబల్యాలను కూడా ప్రతిఫలింపజేస్తుంది. ఆసక్తికరమైన మలుపులు కథను మరింత బలంగా నిలబెట్టాయి.
19. Magpie Murders – Anthony Horowitz
థీమ్: పుస్తకం లోని మిస్టరీ, రచయిత-పాఠక సంబంధం
కొత్త పాఠకులకు ఇది ఆకర్షణీయమైన నవల. ఒక డిటెక్టివ్ రచయిత రాసిన నవలలో జరిగిన హత్యలు నిజజీవితంలోనూ జరుగుతాయి. పాఠకులకు ఈ కథ సరికొత్త అనుభవాన్ని ఇస్తుంది.
20. The Turn of the Key – Ruth Ware
థీమ్: ఆధునిక టెక్నాలజీ, భయం
రోవాన్ అనే యువతి పిల్లల గవర్నెస్‌గా పనిచేస్తూ, ఆధునిక టెక్నాలజీతో నడిచే ఒక ఇంటిలో ఉన్న రహస్యాలను అన్వేషిస్తుంది. ఒక హౌస్ మిస్టరీ నవలగా ఇది కొత్త పాఠకులను ఆకట్టుకునేలా ఉంటుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!