రంగస్థలంలో రామ్‌చరణ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. యాక్టింగ్ ఇరగదీశేశాడు. అయితే, అంతకుమించిన పర్ఫార్మెన్స్‌ని చూడబోతున్నాం. ప్రస్తుతం RC15 సినిమా చేస్తున్నాడు చెర్రీ. ఈ సినిమా అనంతరం రామ్‌చరణ్ ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చేయనున్నాడు. ఈ మూవీలో తన క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుందని, రంగస్థలం సినిమాను మించి ఉంటుందని చెప్పాడు. సెప్టెంబర్ నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నట్లు వెల్లడించాడు. ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్’లో పాల్గొన్న చరణ్ ఈ విషయాన్ని చెప్పడంతో ఒక్కసారిగా చర్చ ఊపందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.
-
Courtesy Twitter:MythriMovieMakers
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్