• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rashmika Mandanna: రష్మిక దగ్గర ఉన్న పెట్ డాగ్స్ బ్రీడ్స్- వాటి లక్షణాలు!
    Hanuman Jayanti 2024: దేశంలో అతి ఎత్తైన ఆంజనేయుడి విగ్రహాలు ఇవే!
    Puri Rath Yatra: నేటి నుంచి పూరీ రథ యాత్ర... మీరు వెళ్లకున్నా ఈ 3 పనులు చేస్తే చాలు!
    Cyclone Biporjoy : ఆఫీసులు, స్కూళ్లు అన్నీ బంద్.. ముంచుకొస్తున్న మహా ముప్పు!
    See More

    రిక్షా లాగుతున్న రోబో తయారు చేసిన విద్యార్థులు

    [VIDEO:](url) గుజరాత్‌లో కొందరు విద్యార్థులు వినూత్నమైన రోబోను తయారు చేశారు. మనిషి మాదిరిగా నడుస్తూ రిక్షాను లాగేలా రూపొందించారు. సూరత్‌కు చెందిన విద్యార్థులు సుమారు 25 రోజులు శ్రమించి తీర్చిదిద్దారు. ఇందుకు రూ. 30 వేలు ఖర్చు అయ్యాయి. మనిషి ఎలా నడుస్తాడనే అంశంపై అధ్యయనం చేసి రోబోను సృష్టించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై నడుస్తుంది. వస్తువులు డోర్ డెలివరీ చేయాలని ఫోన్‌లో మెసేజ్‌ పెడితే చాలు. మెుబైల్ సాయంతో దీన్ని కంట్రోల్‌ చేయవచ్చు. లోపల మెుత్తం మ్యాపింగ్ ఉంటుంది. పూర్తిగా బ్యాటరీ సహయంతో నడుస్తుంది. … Read more

    ఫోన్‌ చూస్తూ ట్రైన్‌ నడిపిన మహిళ.. అంతలోనే!

    [VIDEO](url): రష్యాలో ఓ మహిళా లోకో పైలెట్‌ నిర్లక్ష్యం రైలు ప్రమాదానికి దారితీసింది. మహిళా డ్రైవర్‌ రైలు నడుపుతూ ఫోన్‌తో కాలక్షేపం చేయసాగింది. ట్రాక్‌పై ఓ రైలు ఆగి ఉండటాన్ని ఆమె గమనించలేదు. దీంతో రైలు నేరుగా వెళ్లి ఆగి ఉన్న రైలును ఢీకొట్టింది. రైలు భారీ కుదుపునకు గురి కావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా సీట్లలో నుంచి ఎగిరి పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. రైలుకు సేఫ్టీ ఎక్విప్‌మెంట్ ఉండటంతో పాటు ప్రయాణికుల రద్దీ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. … Read more

    వంతెనపై పేలిన ఆయిల్ ట్యాంకర్‌

    [VIDEO](url): లండన్‌లోని ఓ బ్రిడ్జిపై ఆయిల్ ట్యాంకర్ పేలిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. భారీగా ఎగసిపడిన మంటలతో వంతెన చుట్టుపక్కల భయానక వాతావరణం నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. అయితే కారు అదుపుతప్పి ఆయిల్ ట్యాంక్‌ను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Fire on the gold star bridge in groton Ct? … Read more

    BlueTick:  రోహిత్ శర్మ, కోహ్లీ, ధోని సహా సెలబ్రెటీలకు ట్విట్టర్ బిగ్ షాక్… నెట్టింట్లో ట్విట్టర్‌ను ఏకిపారేస్తున్న ఫ్యాన్స్

    ట్విటర్ బ్లూ టిక్. ప్రస్తుతం ఇదొక ట్రెండింగ్ టాపిక్. ఎందుకంటే దేశంలోని చాలామంది ప్రముఖుల ఐడీలకు ఈ బ్లూటిక్ మాయమైంది. సాధారణంగా ఫేక్ అకౌంట్లను గుర్తించడానికి ఇది సహాయపడేది. కానీ, ప్రస్తుతం ఎవరిది నిజమైన ఐడీనో తెలియని పరిస్థితి ఏర్పడింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని, రజినీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్ వంటి స్టార్ల అకౌంట్లు సాదాసీదాగా మారిపోయాయి.  బ్లూటిక్‌ ఏంటీ? ట్విటర్‌లో ఫేక్‌ ఐడీలు పెరిగిపోవటంతో ఈ బ్లూటిక్‌ కాన్సెప్ట్‌ను తీసుకువచ్చారు. అసలైన అకౌంట్‌కు బ్లూటిక్‌ ఇవ్వటంతో నకిలీ ఖాతాలకు చెక్‌ పడింది. … Read more

    సర్కస్ నుంచి సింహాలు ఎస్కేప్; జనం బెంబేలు

    బోను నుంచి సింహాలు తప్పించుకోవడంతో జనం పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని లుయోయాంగ్‌లో ఓ సర్కస్‌లో ఉన్నట్లుండి రెండు సింహాలు బోనులో నుంచి తప్పించుకున్నాయి. అవి ప్రేక్షకుల మీదకి దూసుకురావడంతో పరుగులు తీశారు. సింహాలు దగ్గరికి వస్తుండటంతో ఏంచేయాలో తెలియక కేకలు వేస్తూ పారిపోయారు. నిర్వాహకులు వాటిని బంధించటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. Luoyang, Henan, China Everything went wrong! It is clear that these animals do not want … Read more

    రెస్టారెంట్‌ను ప్రారంభించిన గోమాత

    [VIDEO](url): ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో ఆసక్తికర ఘటన జరిగింది. ‘ఆర్గానిక్ ఒయాసిస్’పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ను ఓ ఆవు ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆవుపై పచ్చని వస్త్రం కప్పారు. దానికి సేంద్రియ ఆహారం తినిపించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం ఆవులపై ఆధారపడి ఉందని రెస్టారెంట్ ఓనర్ శైలేంద్ర సింగ్ తెలిపారు. అందుకే ముఖ్యఅతిథిగా గోవును ఎంచుకున్నట్లు చెప్పారు. #WATCH | Uttar Pradesh: A restaurant in Lucknow, 'Organic Oasis' that offers … Read more

    వధువును లాగిపెట్టి కొట్టిన వరుడు

    [వీడియో:](url) ఓ వధూవరుల జంట చేసిన పనికి అనుకోకుండా వైరల్ అయ్యారు. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఓ నూతన జంట పెళ్లి రిసెప్షన్‌లో పాల్గొన్నారు. అక్కడ వారిద్దరి మధ్య ఓ సరదా గేమ్ పెట్టారు. ఈ గేమ్ ఎంతో ఆసక్తిగా సాగింది. చివరకు ఈ టాస్క్‌లో వధువే గెలిచింది. ఇక్కడే వరుడికి చిర్రెత్తుకొచ్చింది. వధువు గెలవడంతో పట్టరాని ఆవేశానికి గురయ్యాడు. ఇంకేముంది వధువను చాచిపెట్టి ఒక్కటి పీకాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #groom … Read more

    రూపాయి కాయిన్లతో MLAగా నామినేషన్‌

    [VIDEO](url):కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో యెంకప్ప అనే వ్యక్తి… పూర్తిగా రూపాయి నాణేలతో ఎమ్మెల్యేగా నామినేషన్‌ వేశాడు. నామపత్ర డిపాజిట్‌ రూ.10000లను పూర్తిగా రూపాయి నాణేల్లోనే చెల్లించాడు. యాద్గిర్‌ నియోజకవర్గం నుంచి యెంకప్ప స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. మే 10న జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అతడు నియోజకవర్గంలోని ప్రజల నుంచి రూపాయి రూపాయి సేకరించి నామినేషన్‌ వేశాడు. “స్వామి వివేకానంద సిద్ధాంతాలే నాకు స్ఫూర్తి. నా జీవితాన్ని నా ఊరి ప్రజలకు అంకితం చేస్తాను” అని యెంకప్ప అన్నాడు. #WATCH | … Read more

    SOLAR ECLIPSE:ఏప్రిల్‌ 20న హైబ్రీడ్‌ సూర్య గ్రహణం..తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు!

    ఏప్రిల్ 20 గురువారం నాడు ఆకాశంలో అద్భుతం జరగనుంది. సంపూర్ణ సూర్య గ్రహణం కనిపించనుంది. దక్షిణార్థ గోళంలో సుమారు 79 సెకన్ల పాటు సూర్యుడిని చంద్రుడు పూర్తిగా కమ్మేయనున్నాడు. ఈ గ్రహణం చూడాలనుకునే వాళ్లు పశ్చిమ ఆస్ట్రేలియాకు పయనం అవుతున్నారు. ఇలాంటి  కొన్ని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అద్భుత దృశ్యాల గురించి తెలుసుకోవాల్సిందే. భారత్‌లో ఎక్కడ సూర్య గ్రహణం సంపూర్ణంగా దక్షిణార్థ గోళంలోనే కనిపిస్తుంది. భారత్‌లో హిందూ మహాసముద్రం సమీపంలోని కెర్గులెన్ దీవులు వద్ద ప్రారంభమై పశ్చిమ ఆస్ట్రేలియా, తైమూర్‌ లెస్టే, పశ్చిమ … Read more

    మహిళా అధికారణిపై ఇసుక మాఫియా దాడి

    బిహార్‌: పట్నా జిల్లాలోని బిహ్త్ పట్టణంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు ఓ మహిళా ఆఫీసర్‌పై దాడికి తెగబడింది. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)వైరల్‌గా మారింది. ప్రాణ భయంతో పారిపోతున్న అధికారిణిని కొందరు వెంబడించారు. రాళ్లు, మట్టిపెళ్లలతో దాడిచేశారు. ఆమెను కిందపడేసి నేలపై ఈడ్చుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు 44 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మిగితా వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. #WATCH | Bihar: Woman officer from … Read more