ఏప్రిల్ 20 గురువారం నాడు ఆకాశంలో అద్భుతం జరగనుంది. సంపూర్ణ సూర్య గ్రహణం కనిపించనుంది. దక్షిణార్థ గోళంలో సుమారు 79 సెకన్ల పాటు సూర్యుడిని చంద్రుడు పూర్తిగా కమ్మేయనున్నాడు. ఈ గ్రహణం చూడాలనుకునే వాళ్లు పశ్చిమ ఆస్ట్రేలియాకు పయనం అవుతున్నారు. ఇలాంటి కొన్ని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అద్భుత దృశ్యాల గురించి తెలుసుకోవాల్సిందే.
భారత్‌లో ఎక్కడ
సూర్య గ్రహణం సంపూర్ణంగా దక్షిణార్థ గోళంలోనే కనిపిస్తుంది. భారత్‌లో హిందూ మహాసముద్రం సమీపంలోని కెర్గులెన్ దీవులు వద్ద ప్రారంభమై పశ్చిమ ఆస్ట్రేలియా, తైమూర్ లెస్టే, పశ్చిమ పపువా మీదుగా పసిఫిక్ మహా సముద్రం వద్ద అస్తమిస్తుంది.
ఎక్కువ సేపు
కొన్ని అందమైన దేశాల్లో ఎక్కువసేపు కనిపించే ఆస్కారం ఉంది. పశ్చిమ ఆస్ట్రేలియాలో కొద్దిపాటి ఛాన్స్ ఉన్నప్పటికీ.. సుమారు 50 వేల మంది…. తైమూర్ లెస్టేకి వెళ్తుంటారు. 76 సెకన్ల పాటు అక్కడ సూర్యగ్రహణ దృశ్యాన్ని చూసి ఆస్వాదిస్తారు.
సంపూర్ణం కొందరికే
సంపూర్ణ సూర్య గ్రహణాన్ని ఆస్వాదించే అవకాశం అతి తక్కువ మందికే ఉంది. కొన్ని అందమైన దేశాల్లో మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించే ఆస్కారం ఎక్కువగా ఉంది. పశ్చిమ ఆస్ట్రేలియాలో కొద్దిపాటి ఛాన్స్ ఉన్నప్పటికీ.. సుమారు 50 వేల మంది…. తైమూర్ లెస్టేకి వెళ్తున్నారు. 76 సెకన్ల పాటు అక్కడ సంపూర్ణ సూర్యగ్రహణ దృశ్యాన్ని ఆస్వాదిస్తారు.
హైబ్రిడ్ సూర్య గ్రహణం
భూమికి, సూర్యుడికి మధ్యలో చంద్రుడు రావడం వల్ల సాధారణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. కానీ భూమి ఉపరితలంలో ఉన్న ఎత్తుపల్లాల కారణంగా ఏర్పడే సూర్య గ్రహణాన్ని హైబ్రిడ్ సూర్య గ్రహణం అంటారు. హైబ్రిడ్ సూర్య గ్రహణం సమయంలో సంపూర్ణ, పాక్షిక సూర్య గ్రహణాలు ఏర్పడతాయి. ఇలా పాక్షిక, సంపూర్ణ సూర్య గ్రహణాలు ఒకేసారి ఏర్పడటం చాలా అరుదు. ఈ గ్రహణం సమయంలో చంద్రుడి చుట్టూ సూర్యుడు ఉంగరం మాదిరిగా కనిపిస్తాడు. 21వ శతాబ్దంలో ఇలాంటి సంకర గ్రహణాలు కేవలం 7 సార్లు మాత్రమే కనిపిస్తాయి.
పాక్షికంగా ఇక్కడ
ఈ సంపూర్ణ సూర్య గ్రహణం హిందూ మహాసముద్రం సమీపంలోని కొన్ని ద్వీపాల్లో కనిపిస్తుంది. 1950లో అణు బాంబు పరీక్షలకు ఉపయోగించిన మాంటెబెల్లో మెరైన్ పార్క్ ద్వీపం వద్ద చూడవచ్చు. సముద్ర తీరానికి 200 మైళ్ల దూరంలో ఉన్న మరో ఆసక్తికర ప్రదేశమైన ఆశ్‌మోర్ రీఫ్ ప్రాంతంలో తక్కువ సమయం గ్రహణం ఉంటుంది.
తక్కువగా కనిపిస్తుంది
చాలాచోట్ల సంపూర్ణ సూర్యగ్రహణం చూడటం అసాధ్యం. కానీ, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో సుమారు 693 మిలియన్ల మంది పాక్షిక సూర్య గ్రహణాన్ని చూస్తారు. వీటిని చూడటానికి ఉపయోగించే కళ్లజోడును పెట్టుకొని అతిచిన్న భాగాన్ని వీక్షించవచ్చు.
గ్రహణం తిరిగే ప్రాంతం
ప్రపంచంలోనే అతి పెద్ద చేప సంపూర్ణ సూర్య గ్రహణాన్ని చూడబోతుంది. వేల్ షార్క్స్ కలిసే పశ్చిమ ఆస్ట్రేలియాలోని నింగాలో సముద్ర తీరం, వెస్ట్‌పపువాలోని సెండర్‌వాసిహ్ బే కలిసే పార్క్ వద్ద కనిపిస్తుంది. గ్రహణం పట్టిన సూర్యుడు ఈ రెండు ప్రాంతాల్లో తిరుగుతాడు అంటారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది