ఈ ఏడాది ఏప్రిల్ 20న తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.29 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం అమావాస్య తిథి నాడు ఏర్పడనుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. దీంతో సూతక కాలం ఉండదు. ఈ గ్రహణం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, అంటార్కిటికా, దక్షిణ హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం కనిపించనుంది.
2023లో మెుత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. అందులో రెండు చంద్ర గ్రహణాలు కాగా, మిగిలినవి సూర్య గ్రహణాలు. ఇందులో ముందుగా సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. మెుదటి సూర్యగ్రహణం ఈ నెల 20న ఏర్పడనుండగా.. రెండోది అక్టోబర్ 14న కనిపించనుంది. అటు ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం మే 5న ఏర్పడనుండగా.. రెండోది అక్టోబర్ 28న కనువిందు చేయనుంది.
సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో భూమి మీద వారికి సూర్యుడు పూర్తిగా లేదా పాక్షికంగా కనిపించడు. ఈ ప్రకియ గురించి ప్రాచీన హిందూ మతంకు సంబంధించిన సూర్య సిద్ధాంతంలో కూడా చెప్పారు. అటు ఖగోళ శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే సూర్య గ్రహణం అమావాస్య రోజున మాత్రమే ఏర్పడుతుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!