ఆ మూడు రోజులు దర్శనాలు రద్దు
AP: తిరుమలలో అక్టోబరు 24, 25, నవంబరు 8న బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం ఉండటంతో ఈ మూడు రోజుల్లో దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రోజుల్లో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది. కాగా, 25న సూర్యగ్రహణం కారణంగా రాష్ట్రంలోని వివిధ ఆలయాలనూ మూసివేస్తున్నారు.