ఆందోళన కలిగిస్తున్న ‘క్రాకెన్’
ప్రస్తుతం ప్రపంచదేశాలను XBB.1.5 వేరియంట్ కలవరపెడుతోంది. ఈ వేరియంట్‌నే ‘క్రాకెన్’ అని కూడా పిలుస్తున్నారు. ఈ వేరియంట్ ప్రస్తుతం 28 దేశాల్లోకి పాకింది. భారత్‌లో కూడా ఈ వేరియంట్ ప్రవేశించింది. అమెరికాలోని న్యూయార్క్‌లో పుట్టిన ‘క్రాకెన్’ శరవేగంగా ప్రపంచదేశాలకు పాకుతూ ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో కూాడా 3 కేసులు నమోదైనట్లు సమాచారం. కోవిడ్ 19 ఎలాంటి విధ్వంసం సృష్టించిందో ఈ వేరియంట్ కూడా అలాంటి విధ్వంసమే సృష్టించనుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.