ట్విటర్ బ్లూ టిక్. ప్రస్తుతం ఇదొక ట్రెండింగ్ టాపిక్. ఎందుకంటే దేశంలోని చాలామంది ప్రముఖుల ఐడీలకు ఈ బ్లూటిక్ మాయమైంది. సాధారణంగా ఫేక్ అకౌంట్లను గుర్తించడానికి ఇది సహాయపడేది. కానీ, ప్రస్తుతం ఎవరిది నిజమైన ఐడీనో తెలియని పరిస్థితి ఏర్పడింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ల అకౌంట్లు సాదాసీదాగా మారిపోయాయి.
బ్లూటిక్ ఏంటీ?
ట్విటర్‌లో ఫేక్ ఐడీలు పెరిగిపోవటంతో ఈ బ్లూటిక్ కాన్సెప్ట్‌ను తీసుకువచ్చారు. అసలైన అకౌంట్‌కు బ్లూటిక్ ఇవ్వటంతో నకిలీ ఖాతాలకు చెక్ పడింది. దీని ద్వారానే ప్రముఖులను సులభంగా గుర్తించే అవకాశం లభించింది. అంతకముందు బ్లూటిక్‌ను ఉచితంగానే అందించేవారు. కానీ, ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసి బాధ్యతలు చేపట్టిన తర్వాత మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగా బ్లూటిక్ కావాలంటే డబ్బులు చెల్లించాలనే నిబంధన తీసుకువచ్చాడు. భారత్‌లో ట్విట్టర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం రూ.6,800 చెల్లించాల్సి ఉంటుంది. నెలవారిగా అయితే.. రూ.650 చెల్లించాలి. ప్రస్తుతం ఈ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించనివారి ఖాతా బ్లూటిక్‌ను ట్విట్టర్ తొలగించింది. ఈ కారణం వల్లే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రముఖుల ఖాతాలకు బ్లూటిక్ ఇప్పుడు కనిపించడం లేదు.
రాజకీయ నాయకులు
దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల అకౌంట్లకు బ్లూటిక్ మాయమయ్యింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, యోగీ ఆదిత్యానాథ్ వంటి పలువురు ఖాతాలకు దీన్ని తొలగించారు.
క్రికెటర్లు
టీమిండియా స్టార్ క్రికెటర్లు కూడా షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని అకౌంట్లకు బ్లూటిక్ ఎగిరిపోయింది. ప్రస్తుతం ఏది నిజమైన ఖాతానో, నకిలీ ఖాతానో తేల్చుకోలేకపోతున్నారు నెటిజన్లు.
సినీ హీరోలు
దేశంలో వివిధ ఇండస్ట్రీలకు సంబంధించిన సినీ హీరోలది కూడా ఇదే పరిస్థితి. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, షారుఖ్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల అకౌంట్లకు బ్లూటిక్‌ను తీసివేశారు. కోలీవుడ్‌లో సూర్య, టాలీవుడ్‌లో మహేశ్ బాబు వంటి కొంతమందికి మాత్రమే ఉన్నాయి.
ఎందుకిలా?
ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఖాతాలకు బ్లూటిక్‌ను తొలగించారు. క్రిస్టియానో రొనాల్డో, ఇమ్రాన్ ఖాన్ వంటి వాళ్లు ఉన్నారు. అయితే, ఎందుకు తీసివేశారనే విషయంపై స్పష్టత లేదు. గతంలో కొన్నిసార్లు ఇలాగే జరిగినా వెంటనే పునరుద్ధరించేవారు. అదికూడా కొంతమందికి మాత్రమే జరిగేది. ప్రస్తుతం వందల సంఖ్యలో ఖాతాలకు ఇలా జరగటంతో అందరూ షాక్ అయ్యారు. బ్లూటిక్ కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాలి. కానీ, అలా జరగకపోవటంతోనే తొలగించినట్లు తెలుస్తోంది.
ఏకిపారేస్తున్న నెటిజన్లు
ట్విటర్‌లో ఎలాన్ మస్క్ తీసుకువస్తున్న మార్పులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్లూటిక్ తీసేయడంతో క్రికెట్, సినీ హీరోల అభిమానులు ఫైర్ అయ్యారు. ఎవరిది ఏ అకౌంట్ అనేది ఎలా అర్థమవుతుందని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!