‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) తర్వాత తారక్ (Jr NTR) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’ (Devara). జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)తో జూ.ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ (Janhvi Kapoor), తారక్‌పై చిత్ర యూనిట్ ఓ సాంగ్‌ను అక్కడ చిత్రీకరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ వీడియో లీక్ అయ్యింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ‘దేవర’లో ఎన్టీఆర్‌కు సంబంధించిన లుక్‌ను మేకర్స్ అధికారికంగా రివీల్ చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
రుద్రాక్షతో ఠీవీగా నిలబడ్డ తారక్!
‘దేవర’లో జూ.ఎన్టీఆర్‌కు సంబంధించిన లేటెస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ సోషల్‌మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోలో నడుముపై చేతులు వేసుకొని చాలా దర్జాగా ఎన్టీఆర్ కనిపించాడు. మెడలో రుద్రాక్షతో ఉన్న ఎన్టీఆర్ మాస్ లుక్ చూసి.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్‌తో పాటు డైరెక్టర్ కొరటాల శివ, కొరియోగ్రాఫర్ రాజు సుందరం కనిపించారు. గోవాలో చిత్రీకరిస్తున్న పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ అందింస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్ వీడియో లీక్..
అంతకుముందు గోవాలో ‘దేవర’ షూటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట లీక్ అయ్యింది. సముద్రం ఒడ్డున లుంగీ ధరించి ఉన్న ఎన్టీఆర్.. ఆ వీడియోలో కనిపించాడు. సముద్రం నుంచి తీరం వైపునకు తారక్ నడుచుకుంటూ రావడం ఇందులో కనిపించింది. చిత్ర యూనిట్ పోస్టు చేసిన ఫొటోలో, ఈ వీడియోలో ఉన్న తారక్ లుక్ ఒకటే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కాగా ఈ మూవీలో రెండు పాత్రల్లో తారక్ కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తండ్రికొడులుగా అతడు నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం లీకైన వీడియో ఫాదర్ క్యారెక్టర్‌కు సంబంధించిందని టాక్.
‘దేవర’లో ఎన్టీఆర్ పాత్ర ఇదే!
జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. సముద్ర తీర ప్రాంత ప్రజల సమస్యలను తీర్చే నాయకుడిగా తారక్.. దేవరలో కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్‌లోని హీరోయిజాన్ని దర్శకుడు కొరటాల శివ.. ఈ మూవీతో పతాక స్థాయికి తీసుకెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్‌కు ధీటుగా నిలబడే విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. అతడి పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ రెండు పార్టులుగా రానుండగా.. తొలి భాగాన్ని అక్టోబర్ 10 (Devara Release Date)న రిలీజ్ చేయనున్నారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం