• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. జనం పరుగులు

  రంగారెడ్డి జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్‌లో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురై అక్కడినుంచి పరుగులు తీశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ అబ్దుల్లాపూర్ మెట్ సర్కిల్ వద్దకు రాగానే అదుపు తప్పింది. దీంతో రోడ్డుకు అడ్డంగా బోల్తా పడటంతో స్థానికులు కంగారు పడ్డారు. మరోవైపు, ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్యాంకర్‌ని పక్కకు తొలగించేందుకు సిబ్బందితో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv