• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అశ్లీలత, బూతులకు OTT కేరాఫ్‌గా మారుతోందా? స్టార్లకు ఎందుకు నచ్చట్లేదు?

    డిజిటల్ విప్లవంలో భాగంగా వచ్చిన కీలక మార్పు ఓవర్ ది టాప్(OTT). ఒకప్పుడు సినిమాలు థియేటర్లు, టీవీల్లోనే ప్రసారమయ్యేవి. కానీ, OTT వచ్చాక ఈ సంప్రదాయం పూర్తిగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ వినియోగంతో ఓటీటీ వినియోగం ఊపందుకుంది. అయితే, ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌పై ఎప్పటినుంచో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వ్యతిరేకత మరింత పెరిగింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఓటీటీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో చర్చ ఊపందుకుంది. 

    ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నాయి. కానీ, విస్తృతంగా ప్రజలకు చేరువయ్యింది మాత్రం కరోనా కాలంలోనే. థియేటర్లు మూత పడటంతో సినీ ప్రేక్షకులకు వినోదం దూరమైంది. దీంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీవీల్లో, ఫోన్లలో సినిమాలు, సిరీస్‌లు చూడటానికి చాలామంది అలవాటు పడ్డారు. ఒక్కసారిగా యూజర్ బేస్ పెరిగిపోవడంతో ఓటీటీ ప్లాట్‌ఫాంలు ప్రేక్షకుడిని మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. అయితే, ఈ మార్కెట్ బిజినెస్ పెంచుకునే క్రమంలో కంటెంట్ పరంగా కొన్ని సంస్థలు దిగజారాయి. యూజర్లను త్వరగా అట్రాక్ట్ చేయడానికి బూతు పదాలు, బోల్డ్ సన్నివేశాలను ఎంకరేజ్ చేశాయి. 

    ఓటీటీలో ప్రసారమయ్యే కంటెంట్‌కు సెన్సార్‌షిప్ లేదు. దీంతో విచ్చలవిడి తనం పెరిగిపోయింది. ఫిల్మ్ మేకర్స్‌కి పూర్తిగా రెక్కలొచ్చాయి. జనాలు ఆదరిస్తుండటం వీరికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. నటీనటులు కూడా ఇందుకు తగ్గట్టు నడుచుకోవాల్సి వచ్చింది. చిలికి చిలికి గాలివాన అయినట్లు క్రమంగా అసభ్యకర సన్నివేశాలు, బూతులు, అశ్లీలత, హింస తీవ్రత పెరిగిపోయింది. బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించని పదజాలాన్ని వాడేలా వ్యూయర్స్‌పై ఓటీటీ సిరీస్‌లు తీవ్ర ప్రభావం చూపాయి. తాజాగా వచ్చిన ‘రానానాయుడు’ ఇందుకు ఉదాహరణ అని పలువురు చెబుతున్నారు.

    ఈ సిరీస్‌పై ఒకప్పటి స్టార్ హీరోయిన్‌, బీజేపీ నేత విజయశాంతి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.

    సెన్సార్‌షిప్ ఎందుకు లేదు?

    ఓటీటీలకు సెన్సార్‌షిప్ ఇవ్వడం ఒకరకంగా కాస్త కష్టతరమే. ఇదే విషయమై గతేడాది సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌కి సెన్సార్‌షిప్ ఉండాలనేది పిటిషన్ సారాంశం. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సాధ్యాసాధ్యాలను వెల్లడించింది. వెబ్‌సిరీస్‌లు ఎక్కువ డ్యురేషన్ ఉండటం సమస్యకు ప్రధాన కారణమని కోర్టు అభిప్రాయపడింది. అన్ని గంటల సేపు కూర్చుని ఓ వెబ్‌సిరీస్‌ని సెన్సార్ చేయడం కాస్త ఇబ్బందికరమేనని తేల్చిచెప్పింది. పైగా, ఒక్కో దేశంలో ఒక్కో సెన్సార్‌షిప్ నిబంధనలు ఉంటాయని గుర్తు చేసింది. ఓటీటీ పరిధి ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది గనుక సెటాఫ్ రూల్స్‌ని డిజైన్ చేయలేమని తెలిపింది. 

    సెన్సార్ ఇస్తే ప్రయోజనకరమేనా?

    రెచ్చగొట్టే ప్రసంగాలకు ప్రజలు సులువుగా ఆకర్షితులవుతారు. పైగా ఓటీటీ అందరికీ అందుబాటులో ఉండటం కారణంగా ఇలాంటి కంటెంట్‌కి తర్వగా అట్రాక్ట్ అవుతారు. ఫలితంగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించలేం. అందుకే సెన్సార్ ఇవ్వడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. విద్వేశ పూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయొచ్చు. దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే కంటెంట్‌ని నివారించవచ్చు. ఓటీటీ కంటెంట్‌కి సెన్సార్ షిప్ ఇవ్వడం వల్ల హానికర కంటెంట్ నుంచి చిన్నపిల్లలను దూరంగా ఉంచవచ్చు. 

    ఎందుకు వద్దంటున్నారు?

    ఓటీటీ కంటెంట్‌కి సెన్సార్‌షిప్ ఉండకకూదనే వాదన ఉంది. కొన్ని విషయాలపై ప్రజలకు సినిమాల ద్వారా పూర్తిగా అవగాహన కల్పించలేకపోవచ్చు. మరికొన్నింటిని విడమరచి చెప్పాల్సిన అవసరం ఉండవచ్చు. అలాంటి వాటికి విఘాతం కలిగే అవకాశం ఉందనేది ప్రధాన వాదన. అలాగే ఫిల్మ్ మేకర్ల క్రియేటివిటీని అణచివేసే ముప్పు ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. సెన్సార్ ఇస్తే విభిన్నంగా సిరీస్‌లు తీసే ఫిల్మ్ మేకర్లను ఆలోచనలో పడేలా చేస్తుందని చెబుతున్నారు. 

    మంచి కన్నా చెడు ఎక్కువ..!

    ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌తో ప్రేక్షకుడికి మంచి కన్నా ఎక్కువగా చెడు జరుగుతుందని పలువురు వాదిస్తున్నారు. బూతు పదాలకు ప్రభావితమై వాటినే ప్రేక్షకులు ఉచ్చరిస్తున్నారని అంటున్నారు. ఫలితంగా ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ఇదే విషయమై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అలనాటి నటి విజయశాంతి ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్‌షిప్‌ ఉండాలనేది వారి వాదన.

    ఈ ప్లాట్‌ఫాంలలో అధికంగా..

    కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫాంలో అడల్ట్ కంటెంట్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ఆల్ట్ బాలాజీ, ఉల్లు యాప్, గప్‌చుప్, ఫనియో మూవీస్, హాట్‌షాట్, 8షాట్స్, ఫిజ్ మూవీస్ తదితర యాప్‌లు అడల్ట్ కంటెంట్‌ని పెద్దఎత్తున ప్రసారం చేస్తున్నాయి.

    టాప్ అడల్ట్ ఓటీటీ సిరీస్‌లు(ఇండియా)..

    క్లాస్ ఆఫ్ 2020 

    విద్యార్థుల చుట్టూ తిరిగే కథ ఇది. స్నేహితులే సరదాగా డ్రగ్స్ తీసుకోవడం, శృంగారం చేసుకోవడం, రిలేషన్‌షిప్ మెయింటేన్ చేయడం చుట్టూ కథ తిరుగుతుంది. మొత్తం 32 ఎపిసోడ్‌లు ఉంటుంది. 

    ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్

    జీవితంలో నిలబడటానికి నలుగురు అమ్మాయిలు ఏం చేయాల్సి వచ్చిందనేది సిరీస్ సారాంశం. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయింది. 

    మేడ్ ఇన్ హెవెన్

    నేటి సమాజంలో పెళ్లిళ్లు జరుగుతున్న తీరు గురించి ఉంటుందీ వెబ్‌సిరీస్. 2019లో రిలీజైంది. 

    గందీబాత్

    అడల్ట్ సిరీస్‌లలో దేశంలోనే గందీబాత్ ఫేమస్. చాలా బోల్డ్ సీన్లు ఇందులో ఉన్నాయి. ఐఎండీబీ రేటింగ్ కూడా నాసిరకంగా ఉంది.  

    మాయా: స్లేవ్స్ ఆఫ్ హర్ డిజైర్

     మీరు కాస్త బలహీనులైతే ఈ సిరీస్ అస్సలు చూడొద్దు. గతం మర్చిపోయిన ఓ మహిళను తిరిగి మామూలు మనిషిని చేయడానికి సెక్స్‌ని ఓ కారకంగా చూపెడతారు.దీనికి ఐఎండీబీ రేటింగ్ 5.5 ఇచ్చింది. 

    వర్జిన్ భాస్కర్

    రచయిత అయిన ఓ వ్యక్తి, అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథే ఇది. ఏక్తాకపూర్, శోభాకపూర్ నిర్మించారు. 

    ఆశ్రమ్

    ఆశ్రమాల్లో జరిగే వాటి గురించి ఆశ్రమ్ సిరీస్ తెలుపుతుంది. ఆశ్రమాల పేరిట జరిగే కార్యకలపాల గురించి చెబుతుంది.

    రాత్రి కీ యాత్రి

    2021లో ఈ సిరీస్ విడుదలైంది. రెడ్ లైట్ ఏరియా గురించి ఈ సిరీస్ వివరిస్తుంది. 

    మీర్జాపూర్

    అమెజాన్ ప్రైమ్‌లో అప్పట్లో సంచలనంగా మారిందీ వెబ్‌సిరీస్. క్రైం, అశ్లీలం ఇందులో అధికంగా ఉంటుంది. 

    రానానాయుడు 

    ఇటీవల విడుదలైన ఈ సిరీస్‌లో అశ్లీలత అధికంగా ఉంది. తండ్రి, కొడుకుల మధ్య జరిగే కథ గురించి తెలుపుతుంది. వీటితో పాటు తదితర సిరీస్‌లు అధికంగా అశ్లీలత, బూతు కంటెంట్‌ని కలిగి ఉన్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv