• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kalki 2898 AD On OTT: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న ‘కల్కి’.. ఫస్ట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌గా రికార్డ్‌!

    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) రూపొందించిన రీసెంట్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ‘. దిగ్గజ నటులు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, బాలీవుడ్‌ బ్యూటీలు దీపికా పదుకొనే, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కొత్త రికార్డులను క్రియేట్‌ చేసింది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ సినిమాను మేకర్స్‌ ఓటీటీలో రిలీజ్‌ చేశారు. ఏకంగా రెండు వేదికల్లో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఓటీటీలోనూ సరికొత్త రికార్డులతో కల్కి దూసుకెళ్తోంది. ప్రపంచంలోనే సెకండ్‌ ఫిల్మ్‌గా ట్రెండింగ్‌ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

    గ్లోబల్‌ స్థాయిలో ట్రెండింగ్‌

    ‘కల్కి 2898 ఏడీ చిత్రం ఆగస్టు 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషలకు సంబంధించిన కల్కి సినిమాను అమెజాన్‌ ప్రైమ్ స్ట్రీమింగ్ చేస్తోంది. హిందీ వెర్షన్‌ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో వేదికగా అందుబాటులోకి వచ్చింది. అయితే ‘కల్కి’ హిందీ వెర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. నాన్‌ ఇంగ్లీష్‌ లిస్టులో గతవారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్‌ జాబితాలో సెకండ్ ప్లేస్‌లో స్థానం సంపాదించింది. కల్కి హిందీ వెర్షన్‌ ఇప్పటివరకూ 4.5 మిలియన్‌ నిమిషాల వ్యూస్‌ సాధించినట్లు నెట్‌ఫ్లిక్స్‌ వర్గాలు వెల్లడించాయి. అతి తక్కువ టైమ్‌లో ఈ ఘనత సాధించిన ఫస్ట్‌ ఇండియన్‌ సినిమా ఇదేనన్న ప్రచారమూ జరుగుతోంది. దీన్ని బట్టి ఓటీటీలోనూ కల్కి గ్లోబల్‌ స్థాయిలో అదరగొడుతున్నట్లు చెప్పవచ్చు. 

    అమెజాన్‌లో వెనుకంజ

    అమెజాన్‌లో దక్షిణాది భాషల్లో కల్కి స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి ధనుష్‌ హీరోగా తెరకెక్కిన ‘రాయన్‌’ (Raayan) నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కల్కి చిత్రం ఆగస్టు 22న అమెజాన్‌లో స్ట్రీమింగ్‌లోకి రాగా ‘రాయన్‌’ ఒక రోజు తర్వాత ఆగస్టు 23న ప్రసారంలోకి వచ్చింది. అయినప్పటికీ కల్కిని వెనక్కి నెట్టి ఇండియాలోనే టాప్‌ 1 స్థానంలో రాయన్‌ ట్రెండింగ్ అవుతోంది. కల్కికి మించిన వ్యూస్‌తో అమెజాన్‌లో రాయన్‌ దూసుకుపోతోంది. దీంతో రాయన్‌ తర్వాతి స్థానం (సెకండ్‌ ప్లేస్‌)తో ‘కల్కి’ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే కల్కిని ఇప్పటికే చాలా ముంది చూసేయడంతో ఓటీటీలో ‘రాయన్‌’కు ఆదరణ పెరిగినట్లు తెలుస్తోంది. 

    ‘ఈ తరంలో కల్కి బెస్ట్‌’..

    ‘కల్కి’ టీమ్‌పై హీరో సిద్ధార్థ్‌ ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రంపై పోస్టు పెట్టిన ఆయన ప్రభాస్ పాత్ర అద్భుతమని కొనియాడారు. ‘నాకు ప్రభాస్‌ అంటే చాలా ఇష్టం. ఇందులో భైరవా నాకు ఎప్పటికీ ఇష్టమైన పాత్రగా మిగిలిపోతుంది. కర్ణుడుగా ఆయన నటన అద్భుతం. నాగ్‌ అశ్విన్‌ బాగా చిత్రీకరించారు. ఇది ఈ తరంలో వచ్చిన చిత్రాల్లో బెస్ట్‌. నాగ్‌ అశ్విన్‌, వైజయంతి మైవీస్‌ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నా. గొప్ప సినిమా కాబట్టే ఆ స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకుంది’ అని సిద్ధార్థ్‌ (siddharth) అన్నారు. కాగా, కల్కి చిత్రంలో విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, రాజమౌళి, ఆర్జీవీ చిన్న క్యామియోలో కనిపించి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు. 

    ప్రభాస్‌ బిగ్గెస్ట్‌ స్టార్‌

    పాన్ ఇండియా స్థాయి చిత్రాలతో దూసుకుపోతున్న హీరో ప్రభాస్‌పై తమిళ స్టార్ హీరో విక్రమ్‌ ప్రశంసలు కురిపించారు. తన లేటెస్ట్‌ చిత్రం ‘తంగలాన్‌’పై ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన విక్రమ్‌ ప్రభాస్‌ను ఆకాశానికెత్తారు. ‘ప్రభాస్‌ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్‌ సూపర్‌ స్టార్‌. అతడిని తెలుగు హీరో అనడం సరికాదు’ అని విక్రమ్‌ అన్నారు. ఇదే ఇంటర్యూలో పాల్గొన్న మాళవిక సైతం ప్రభాస్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజా సాబ్‌లో ప్రభాస్‌తో కలిసి నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. భాషపరంగా సినిమా సరిహద్దులను ప్రభాస్‌ తొలగించారని ప్రశంసించారు. ఆయన నటించిన సినిమాలపై ప్రేక్షకులు చూపే అభిమానం చూస్తే ఆశ్చర్యమేస్తుందని చెప్పారు. ఇక ‘రాజాసాబ్‌’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో అలరిస్తుందని మాళవిక స్పష్టం చేశారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv