• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kavya Maran: సన్‌రైజర్స్‌ ఆటగాళ్లకు మించిన క్రేజ్‌.. కావ్య వచ్చిందంటే కెమెరాలు తిరగాలంతే..!

    ఐపీఎల్‌లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఒకటి. తెలుగు రాష్ట్రాల్లోని కోట్లాది మంది అభిమానులు SRHను తమ సొంత జట్టుగా భావించి ప్రోత్సహిస్తుంటారు. అయితే గత కొన్ని సీజన్లుగా హైదరాబాద్‌ జట్టు దారుణంగా విఫలమవుతుండటం ఫ్యాన్స్‌కు అంతగా రుచించడం లేదు. వేలంలో సరైన ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం, కీలక ఆటగాడు సరైన సమయంలో చేతులు ఎత్తివేయడం ఫ్యాన్స్‌ను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. దీంతో ఆ కోపాన్ని అంతా సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌పై అభిమానులు చూపిస్తున్నారు. ముఖ్యంగా SRH ఓనర్‌ కావ్య మారన్‌ను లక్ష్యంగా చేసుకొని సోషల్‌ మీడియాలో విరుచుకుపడుతున్నారు. SRH ఓడితే అందుకు బాధ్యురాలిగా కావ్యాను చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. 

    ట్విటర్‌లో ఒకసారి కావ్య మారన్‌ పేరు కొడితే చాలు.. ఎన్నో ట్రోలింగ్‌ పోస్టులు వచ్చి వాలిపోతాయి.  

    అయితే ప్రస్తుతం SRH జట్టు కంటే కావ్య మారన్‌కే ఎక్కువ క్రేజ్‌ ఉందని చెప్పొచ్చు. కావ్య మ్యాచ్‌ చూడటానికి వచ్చిందంటే మైదానంలోని కెమెరాలన్నీ ఆమె వైపు తిరగాల్సిందే. సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు సిక్స్‌ కొట్టినా, వికెట్లు తీసినా వెంటనే కెమెరామెన్‌ ఫోకస్‌ కావ్య పైకి వెళ్లిపోతుంది. ఇందుకు అనుగుణంగానే జట్టును ప్రోత్సహిస్తూ మైదానం వెలుపల ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. కీలక సమయంలో సన్‌రైజర్స్‌ బ్యాటర్‌ ఔటైతే కావ్య ముఖంలో వెంటనే ఫ్రస్టేషన్‌ కనిపిస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియోలే సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. 

    SRH మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ప్రతీసారి కెమెరామెన్‌ తనపై ఫోకస్‌ పెట్టడం కావ్య మారన్‌కు నచ్చడం లేదు. SRHvsPBKS మ్యాచ్‌లో మళ్లీ కెమెరా తనవైపు తిరగడంతో కావ్య బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ‘అరే యార్‌’ అంటూ కెమెరామెన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో తెగ్‌ వైరల్‌ అవుతోంది. కావ్య మేడమ్‌.. ఎందుకు అంత కోపం అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

    వాస్తవానికి సన్‌రైజర్స్‌ అసలు ఓనర్‌ సన్‌ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ కళానిధి మారన్‌. అయితే కావ్య మారన్‌ ఆయన కూతురు కావడంతో పాటు క్రికెట్‌పై ఆసక్తి ఉండటంతో ఫ్రాంచైజీ బాధ్యతలను ఆమె దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రతీ వేలంలో పాల్గొంటూ కీలక ఆటగాళ్ల కొనుగోళ్లలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. జట్టు వరుసగా విఫలమవుతున్నప్పటికీ కావ్య నిరాశ చెందడం లేదు. ప్రతీ సీజన్‌లో SRHకు అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకొస్తూ బలమైన జట్టుగా తీర్చిదిద్దుతోంది. అయితే కావ్య అంచనాలను మాత్రం SRH ఆటగాళ్లు అందుకోలేకపోతున్నారు. 

    గత ఐపీఎల్‌ సీజన్లతో పోలిస్తే SRH జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. సౌతాఫ్రికా బ్యాటర్‌ మార్‌క్రమ్‌ కెప్టెన్‌ బాధ్యతలు చేపట్టడం ఆ జట్టులో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ ఊపుతోనే గత మ్యాచ్‌లో పంజాబ్‌పై 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి తమ బలం ఎంటో ప్రత్యర్థి జట్టుకు చూపింది. ఇదే ఊపును మిగతా మ్యాచ్‌ల్లోనూ కొనసాగించాలని సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు భావిస్తున్నారు. 2016 తర్వాత ప్రతీ సీజన్‌లో కలగా మిగిలిపోతున్న ఐపీఎల్‌ ట్రోఫీని గెలిచి కావ్య మారన్‌కు బహుమతిగా ఇవ్వాలని కసితో ఉన్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv