Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగా మరో రాజమౌళి కానున్నారా? ఇది చూస్తే నిజమే అంటారు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగా మరో రాజమౌళి కానున్నారా? ఇది చూస్తే నిజమే అంటారు!

    Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగా మరో రాజమౌళి కానున్నారా? ఇది చూస్తే నిజమే అంటారు!

    September 24, 2024

    దేశం గర్వించతగ్గ దర్శకుడిగా దర్శకధీరుడు రాజమౌళి గుర్తింపు సంపాదించారు. పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలు తీస్తు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సినిమా అంటే ఇలా ఉండాలి అనే స్థాయిలో ఇతర దర్శకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘ఆర్ఆర్‌ఆర్‌’ చిత్రం ద్వారా ఆస్కార్‌ వంటి ప్రతిష్టాత్మక అవార్డును దేశానికి అందించి సత్తా చాటారు. అయితే రాజమౌళి తర్వాత ప్రస్తుతం ఆ స్థాయిలో వినిపిస్తున్న పేరు సందీప్‌ రెడ్డి వంగాదే. తీసింది మూడే సినిమాలు అయినప్పటికీ ఏ డైరెక్టర్‌కు రానీ అటెన్షన్‌ సందీప్‌కు వస్తోంది. రాజమౌళి తరహాలోనే సందీప్‌ సినిమాలో నటించేందుకు స్టార్‌ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. సందీప్‌ స్టోరీ చెబితే గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    యునిక్‌ డైరెక్షన్‌

    ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో సందీప్‌ రెడ్డి వంగా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాలో హీరో క్యారెక్టర్‌ను చూపించిన విధానం యూత్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో తీసి మరోమారు హిట్‌ కొట్టాడు. రీసెంట్‌గా రణ్‌బీర్‌ సింగ్‌తో ‘యానిమల్‌’ (Animal) చిత్రాన్ని తెరకెక్కించి బాక్సాఫీస్‌ వద్ద ప్రకంపనలు సృష్టించాడు. అయితే సందీప్‌ కథ చెప్పే విధానం ఇతర డైరెక్టర్లతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. హీరో క్యారెక్టర్‌ను చాలా బాగా ఎస్టాబ్లిష్‌ చేస్తాడని చెబుతుంటారు. అతడు డిజైన్‌ చేసే హీరో రోల్స్‌ అభిమానులకు మంచి కిక్‌ ఇస్తాయి. హీరో క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా యునిక్‌ డైరెక్షన్‌లో చూపిస్తుండటంతో సందీప్‌తో వర్క్‌ చేసేందుకు స్టార్‌ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. 

    క్యూ కడుతున్న స్టార్స్‌!

    ‘యానిమల్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత సందీప్ – ప్రభాస్ కాంబోలో ‘స్పిరిట్’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా మరో ప్రాజెక్ట్‌ కన్ఫార్మ్‌ అయినట్లు తెలుస్తోంది. ఇక మహేష్ కూడా రాజమౌళితో సినిమా కంప్లీట్ అయ్యాక సందీప్‌తో మూవీకి ఓకే చెప్పనున్నట్లు సమాచారం. ఇప్పటికే కథను మహేష్‌కు వివరించినట్లు పలు ఇంటర్యూలలో సందీప్‌ తెలిపాడు. అలానే రీసెంట్‌గా తారక్ కూడా సందీప్ రెడ్డితో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇక చరణ్ కూడా త్వరలోనే సందీప్‌తో మాట్లాడనున్నట్లు మెగా కాంపౌండ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ స్టార్స్ కాకుండా అటు బాలీవుడ్‌లో ‘యానిమల్-2’ ఎలానూ ఉంది. దీనిని బట్టి సందీప్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సందీప్‌తో సినిమా అంటే ఎంత బిజీ షెడ్యూల్‌లో అయినా డేట్స్‌ ఇచ్చేందుకు స్టార్ హీరోలు సిద్ధంగా ఉంటున్నారు. రాజమౌళి తరహాలోనే సందీప్‌ కూడా పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్ సినీ లవర్స్ కోరుకుంటున్నారు. 

    స్పిరిట్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

    ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్‌’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది. బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ (Kareena Kapoor) ఇందులో ప్రభాస్‌కు జోడీగా నటించబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. పదేళ్ల క్రితం బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ అయినా కరీనా కపూర్‌ ప్రస్తుతం అడపా దడపా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఓ స్టార్‌ హీరో పక్కన హీరోయిన్‌గా చేయనున్నట్లు వార్తలు రావడం ఆసక్తి రేపుతోంది. ప్రభాస్‌, కరీనా జోడీ ఎలా ఉంటుందోనని ఇప్పటినుంచే ఫ్యాన్స్‌ ఊహించుకుంటున్నారు. దీనిపై స్పిరిట్‌ యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

    ప్రభాస్‌ విలన్‌ మళ్లీ రిపీట్‌!

    బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ఇటీవల కాలంలో విలన్ రోల్స్‌ కేరాఫ్‌గా మారుతున్నారు. ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రావణాసురుడిగా నటించినా సైఫ్‌ అలీఖాన్‌ ‘దేవర’లో తారక్‌కు ప్రత్యర్థిగా నటించారు. ఇటీవల రిలీజైన ‘దేవర’ ట్రైలర్‌లో క్రూరంగా కనిపించి ఆకట్టుకున్నారు. స్పిరిట్‌పై వచ్చిన మరో బజ్‌ ప్రకారం సైఫ్‌ అలీఖాన్‌ ఇందులోనూ నెగిటివ్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్‌ పాత్రలో సైఫ్‌ కనిపించనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే స్పిరిట్‌లో హీరోయిన్‌ అంటూ రూమర్లు ఎదుర్కొంటున్న కరీనా కపూర్‌.. సైఫ్‌ అలీఖాన్‌కు భార్య. దీంతో భార్య హీరోయిన్‌గా, భర్త విలన్‌గా కనిపిస్తారన్న టాక్‌ ఆసక్తి రేపుతోంది. ఇదే నిజమైతే స్పిరిట్‌పై అంచనాలు మరో లెవల్‌కు వెళ్లడం ఖాయమని అంటున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version