SSMB29: ఇంకో వారంలో కథ లాక్‌ అయ్యే ఛాన్స్.. కీరవాణి కీలక వ్యాఖ్యలు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SSMB29: ఇంకో వారంలో కథ లాక్‌ అయ్యే ఛాన్స్.. కీరవాణి కీలక వ్యాఖ్యలు!

    SSMB29: ఇంకో వారంలో కథ లాక్‌ అయ్యే ఛాన్స్.. కీరవాణి కీలక వ్యాఖ్యలు!

    June 25, 2024

    ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా హిట్‌తో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli).. సూపర్‌స్టార్‌ మహేష్ బాబు (Mahesh Babu)తో తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఈ క్రేజీ కాంబో చిత్రం ఎప్పుడు మెుదలవుతుందా? అని యావత్‌ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే వచ్చిన అప్‌డేట్స్‌ సైతం ఫ్యాన్స్‌ను తెగ ఖుషి చేశాయి. మహేష్‌ లుక్‌ ఇదేనంటూ బయటకొచ్చిన ఫొటోలు సైతం అందర్ని ఆకట్టుకున్నాయి. ఇక ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకొని త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుందని భావిస్తున్న క్రమంలో సంగీత దర్శకుడు కీరవాణి షాకింగ్ కామెంట్స్‌ చేశారు. 

    కథ రెడీ కాలేదా?

    రాజమౌళి దర్శకత్వంలో రానున్న ‘SSMB29‘ మూవీ షూట్‌.. మహేష్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా సెట్స్‌పైకి వెళ్తుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఆగస్టు 9న ఈ మూవీ ఎట్టిపరిస్థితుల్లో మెుదలవుతుందని నమ్ముతున్నారు. అయితే మ్యూజిక్‌ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి వారి ఆశలపై తాజాగా నీళ్లు చల్లారు. తానింకా ఈ ప్రాజెక్ట్‌పై పని కూడా మెుదలు పెట్టలేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కథ కూడా ఇంకా ఫైనల్‌ కాలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కొన్ని టెస్ట్‌ షూట్స్ జరుగుతున్నాయని.. ఒక వారంలో కథ లాక్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని కీరవాణి స్పష్టం చేశారు. తన మ్యూజిక్‌ వర్క్స్‌ జులై లేదా ఆగస్టులో మెుదలుపెడతానని స్పష్టం చేశారు. టెస్ట్ షూట్స్ జరుగుతున్నాయంటే ఈ మూవీ షూటింగ్.. ఈ ఏడాది ఆఖరులో గానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 

    కథ.. ఆ నవలల ఆధారమేనా?

    రాజమౌళి తండ్రి స్టార్‌ రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌.. ‘SSMB29’ సినిమాకు కథను అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాజమౌళి & టీమ్‌.. రెండు ఆఫ్రికా నవలల హక్కులను కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విల్బర్‌ స్మిత్‌ రాసిన రెండు నవలలను వారు కొనుగోలు చేసినట్లు జోరుగా టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ‘SSMB29’ ఉంటుందని  సినీ వర్గాల్లో టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఆఫ్రికా దేశానికి సంబంధించిన నవలల హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు రావడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. వీటి ఆధారంగానే రాజమౌళి SSMB29 తెరకెక్కించనున్నారా? అన్న సందేహాం అభిమానుల్లో మెుదలైంది. ఇందులో నిజానిజాలు ఎంతో చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 

    మహేష్ ద్విపాత్రిభినయం!

    రాజమౌళి తెరకెక్కించనున్న ‘SSMB29’ మూవీలో మహేష్‌ ద్విపాత్రిభినయం చేయబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. అయితే దీనిపై రాజమౌళి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. ఇది సూపర్ స్టార్ అభిమానులకు నిజంగా శుభవార్త కానుంది. ఇక ఈ మూవీలో మహేష్‌ చాలా ఇంటెన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటి వరకూ చూడని మహేష్‌ను ఈ సినిమాలో చూడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    నాని స్పెషల్‌ రోల్‌..!

    ‘SSMB 29’ గురించి మరో రూమర్‌ గతంలో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ సినిమాలో యంగ్‌ హీరో నాని (Nani) ఓ స్పెషల్‌ రోల్‌లో నటించనున్నట్లు టాక్ వినిపించింది. వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా తెరకెక్కనుండటంతో పలు పాత్రల కోసం రాజమౌళి.. టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకూ నటీనటులను రంగంలోకి దించనున్నారట. ఈ క్రమంలోనే ఒక పాత్ర కోసం నాని పేరును ఫైనల్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. రాజమౌళి, నాని మధ్య మంచి అనుబంధం ఉండటంతో యంగ్‌ హీరో నటించడం ఖాయమని అంటున్నారు. దీనిపై రాజమౌళి టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా, గతంలో రాజమౌళి రూపొందించిన ‘ఈగ’ సినిమాలో నాని నటించాడు. స్క్రీన్‌పైన కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ మంచి పేరు తెచ్చుకున్నాడు. 

    ఆ భామకు ఛాన్స్‌ దక్కిందా?

    ‘SSMB 29’ సినిమాలో హీరోయిన్‌గా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. మహేష్‌కు జోడీగా అలియా భట్‌ (Alia Bhatt) అయితే ఎలా ఉంటుందని మేకర్స్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో దర్శకుడు రాజమౌళి.. అలియా భట్‌తో పని చేశారు. ఇందులో అలియా భట్‌ నటన నచ్చడంతో మళ్లీ ఆమెను రిపీట్‌ చేసే అవకాశముందని కామెంట్లు వినిపిస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాగా, హాలీవుడ్‌ నటి చెల్సియా ఇస్లాన్‌ కూడా ‘SSMB 29’ చిత్రానికి ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తను కూడా మేకర్స్ ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version