గడుపు ముగిసినా రూ.2వేల నోట్లు మార్చుకోవచ్చు
RBI రూ.2వేల నోట్ల మార్పిడిపై కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 8వ గడువు ముగిసిన తర్వాత కూడా నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. అయితే, ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. రూ.2000 నోట్లు ఉపసంహరణకు ముందు రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. అందులో రూ.3.43 లక్షల కోట్లు ఇప్పటి వరకు వెనక్కి వచ్చినట్లు RBI పేర్కొంది. వాటిలో 87 శాతం నోట్లు డిపాజిట్ల రూపంలోనే వచ్చాయని వెల్లడించింది.