• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గుడ్ న్యూస్.. పాక్‌‌ మ్యాచ్‌లో గిల్?

    డెంగ్యూ కారణంగా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్తాన్‌ మ్యాచ్‌లకు దూరమైన శుభ్‌మన్ గిల్ అహ్మదాబార్ చేరుకున్నాడు. అతడు ఫిట్‌నెస్ సాధిస్తే ఈ నెల 14న పాకిస్తాన్‌తో జిరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇటీవల మంచి ఫామ్ కొనసాగిస్తున్న శుభ్‌మన్ గిల్ ప్రపంచకప్ ప్రారంభానికి ముందు డెంగ్యూ బారిన పడటంతో ఆటకు దూరమయ్యాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న గిల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసైతే పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.

    మంచి ప్రదర్శనే.. అయినా విమర్శలు

    గతంలో తాను మంచి ప్రదర్శన చూపినప్పటికీ క్రికెట్ అభిమానుల నంచి విమర్శలు వచ్చేవని, అలాంటి సమయంలో బాధగా అనిపించేదని ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఐపీఎల్ సమయంలో గాయపడి మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రాహుల్ ఆసియా కప్‌లో తిరిగి జట్టులో చేరాడు. 5 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నానని చెప్పాడు. ప్రపంచకప్‌లో ఆడడం ప్రతి ఒక్కరి కల అని, ఇప్పడు సంతోషంగా ఉందని రాహుల్ పేర్కొన్నాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో రాహుల్ కీలకంగా వ్యవహరించాడు.

    క్రికెట్‌లో ఇలాంటివి సాధారణం: కమిన్స్

    ప్రపంచ కప్‌లో భాగంగా నిన్న చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించడంపై క్రికెటర్ కమిన్స్ స్పందించాడు. తాము 200 పరుగులకే పరిమితం కావడం ఇబ్బంది కలిగించిందని, మరో 50 పరుగులు చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. మిచెల్ మార్ష్ కోహ్లీ క్యాచ్‌ను మిస్ కావడం గురించి అప్పుడే మర్చిపోయానని, ఇలాంటివి క్రికెట్‌లో సర్వసాధారణం అని కమిన్స్ పేర్కొన్నాడు. కాగా, ఈ లైఫ్ తర్వాత కోహ్లీ మెరుగ్గా ఆడి భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. https://www.instagram.com/reel/CyI_IFJPRJY/?utm_source=ig_embed&ig_rid=abd1fd86-cc97-4dd2-9e17-74ce4bd3db35