24 గంటల్లో రూ. 42 కోట్లు సీజ్
అసెంబ్లీ ఎన్నికల వేళ.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.42 కోట్లకు పైగా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విస్తృత తనిఖీల్లో ఇంత మొత్తం బయటపడినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మరోవైపు రాష్ట్ర అబ్బారీ శాఖ సైతం రూ.1,68,45,982 విలువైన మద్యం పట్టుకుంది. ఎన్నికల కోడ్ విడుదలైన తర్వాత మొత్తం రూ.281 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.