ఆదిత్య ఎల్1 కీలక మైలు రాయి
సూర్యుడిపై ప్రయోగించిన ‘ఆదిత్య- ఎల్ 1 మరో మైలురాయిని చేరుకుంది. భూమి నుంచి ఈ వ్యౌమనౌక 9.2 లక్షల కిలోమీటర్లకుపైగా దూరం ప్రయాణించింది. తాజాగా ISRO ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ క్రమంలోనే భూ గురుత్వాకర్షణ పరిధిని విజయవంతంగా దాటినట్లు పేర్కొంది. ఈ వ్యౌమనౌక భూమి నుంచి సూర్యుడి దిశగా సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ మొదటిసారి ఈ ఘనత సాధించినట్లు ఇస్రో తెలిపింది.