ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు
రానున్న 48 గంటల్లో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతాయని వెల్లడించింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కుంభవృష్టి ఉంటుందని హెచ్చరించింది. ఏలూరు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తెలికాటి నుంచి మోస్తరు వానలు పడనున్నట్లు అంచనా వేసింది. నిన్న నెల్లురూలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.