దీపావళి బతుకమ్మ ఉయ్యాలో..
అన్ని చోట్లా దీపావళి పండుగకు ముందే బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటుంటే హన్మకొండ జిల్లా సీతంపేట గ్రామంలో మాత్రం ఇప్పుడు చేస్తున్నారు. గ్రామంలోని నేతకాని కులస్తులు మాత్రమే ఈ పండుగ చేసుకుంటారు. మూడు రోజుల పాటు ఈ పండుగ నిర్వహిస్తారు. ఊరి చెరువు గట్టు దగ్గరికి అందరూ చేరుకుని బతుకమ్మ ఆడతారు. ఒకరిపై ఒకరు కుంకుమ, నీళ్లు చల్లుకుని, ఇంటికి వెళ్లి సుంకు చల్లుకుంటారు.ఈ కార్యక్రమానికి నేతకాని కులస్తుల రాష్ట్ర నాయకులు, ప్రముఖ నాయకులు హాజరవుతారు.