త్వరలో దేశ వ్యాప్తంగా BSNL 4జీ సేవలు
BSNL 4జీ సేవలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని bsnl అధికారులు తెలిపారు. ముందుగా పంజాబ్ నుంచి ఈ సేవలు ప్రారంభిస్తామని వెల్లడించారు. bsnl 4జీ సేవలకు సంబంధించి ఇప్పటికే 200 ప్రదేశాల్లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ముందుగా పంజాబ్లో ప్రారంభించి దశలవారీగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని స్పష్టం చేశారు. 2024 జూన్ నాటికి దేశ వ్యాప్తంగా bsnl 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.