‘కాల్పుల విరమణ అంటే లొంగిపోవడమే’
హమాస్ మిలిటెంట్‌లపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో కాల్పుల విరమణ అంటే హమాస్‌కు లొంగిపోవడమే అవుతుందన్నారు. యుద్ధంలో మానవతా విరామం ఇచ్చేందుకు అనుకున్నదానికంటే ఆలస్యమైందన్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి, బందీల విడుదలకు ఉత్తరగాజాలో జరుపుతోన్న పోరుకు రోజూ నాలుగు గంటలు విరామం ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరించిందని తెలిపారు.