పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో త్రిగుణ్ ఓ ఇంటి వాడయ్యాడు. నివేదిత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. చెన్నైలో బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. కాగా ఆర్జీవీ తెరకెక్కించిన ‘కొండా’ చిత్రంతో త్రిగుణ్ ఫేమస్ అయ్యాడు. తుంగభద్ర, ప్రేమదేశం, పీవీఎస్ గరుడవేగ, కిరాయి, కథ కంచికి.. మనం ఇంటికి, చీకటి గదిలో చితక్కొట్టుడు తదితర సినిమాల్లో త్రిగుణ్ నటించి మెప్పించాడు.