ఈ హీరోలు చిలిపి వ్యక్తులు: దివ్యాంశ కౌశిక్
హీరోలు నాగచైతన్య, రవితేజ గురించి హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ ఆసక్తికర విషయాలు తెలిపింది. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, నాగచైతన్య మజిలీలో దివ్యాంశ యాక్ట్ చేసింది. ఈ ఇద్దరు హీరోలకు కూడా ఓ విషయంలో పోలిక ఉందని చెప్పింది. ఇద్దరూ చిలిపి పనులు చేస్తారని, తాను కూర్చునే సమయంలో కుర్చీని లాగేసేవారని పేర్కొంది. రవితేజ సెట్లో ఎనర్జీతో ఫుల్ జోష్లో ఉంటారని తెలిపింది. కానీ నాగ చైతన్య చాలా ప్రశాంతంగా ఉంటారని వెల్లడించింది. Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: