ఇకపై నకిలీ సర్టిఫికెట్లకు చెక్
నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. అన్ని యూనివర్సిటీలు డిజీ లాకర్‌ను వినియోగించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రతి వర్సిటీకి ప్రత్యేక కోడ్ కేటాయించింది. విద్యార్థులకు సంబంధించిన విద్యార్హత ధృవపత్రాలను ఈ డిజీ లాకర్లో భద్రపరుస్తారు. విద్యార్థులు తమకు ఎప్పడు అవసరమైనా వాటిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానంతో సర్టిఫికెట్లపై ఉన్న పేర్లు, సంవత్సరాలను మార్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఫేక్ సర్టిఫికెట్లను అరికట్టే అవకాశం ఉంది.