• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • దేవుడే నాకు పరీక్ష పెట్టాడు: మెస్సీ

  ప్రపంచ ఫుట్‌బాల్ ఛాంపియన్ కెప్టెన్ లియోనల్ మెస్సీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడడానికి ఆ దేవుడే ఇన్ని పరీక్షలు పెట్టాడని మెస్సీ చెప్పుకొచ్చాడు. 2014లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో మెస్సీ నేతృత్వం వహించిన అర్జెంటినా జట్టు ఓడిపోయింది. అనంతరం కోపా అమెరికా ఫైనల్స్‌లోనూ 3 సార్లు జట్టు పరాజయం పాలైంది. ఇలా ఎన్నో పరాజయాలు చవిచూసిన తర్వాతే ప్రపంచకప్ ట్రోఫీ దక్కిందని మెస్సీ గుర్తు చేసుకున్నాడు. డియాగో మారడొనా తనలో స్థైర్యం నింపాడని లిటిల్ మాస్టర్ వెల్లడించాడు. 2021లో అర్జెంటినా కోపా … Read more

  అర్ధభాగంలో అర్జెంటినాదే ఆధిపత్యం

  ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో అర్జెంటినాకు అదిరే ఆరంభం లభించింది. హాఫ్ టైం ముగిసే సమయానికి అర్జెంటినా 2-0 తో లీడ్‌లో ఉంది. 13 నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ నమోదు కావడం విశేషం. 23వ నిమిషంలో పెనాల్టీగా అందివచ్చిన అవకాశాన్ని కెప్టెన్ మెస్సీ సద్వినియోగం చేసుకున్నాడు. ఫ్రాన్స్ గోల్‌కీపర్ దృష్టి మరల్చి బాల్‌ను నెట్‌లోకి పంపించి సంబరాలు చేసుకున్నాడు. అనంతరం 36వ నిమిషంలో డి మరియా ఎడమ కాలితో అద్బుత ఫార్వార్డ్ కిక్‌‌ని గోల్‌గా మలిచి జట్టును ఆధిపత్యంలోకి తీసుకెళ్లాడు.

  స్వప్నం చెదిరిపోయింది: రొనాల్డో

  పోర్చుగల్‌కు ప్రపంచకప్ అందించాలన్న చిరకాల స్వప్నం చెదిరిపోయిందని క్రిస్టియానో రొనాల్డో భావోద్వేగానికి గురయ్యాడు. దేశానికి కప్పు అందించడం కోసం చేయాల్సిందంతా చేశానని.. అంతా శూన్యమైందని ఉద్విగ్నానికి లోనయ్యాడు. ‘ఎన్నో అంతర్జాతీయ టోర్నీలు గెలిచినా.. అత్యున్నతమైన ప్రపంచకప్‌ని అందించాలన్న కల ఉండేది. ఈ 16ఏళ్లలో దానికోసం శాయాశక్తులా ప్రయత్నించాను. ఎన్ని ఆరోపణలు వచ్చినా దేశానికి అంకితభావంతోనే ఆడాను. కానీ, మొరాకోపై ఓటమితో ఒక్కసారిగా ఆ కల చెదిరిపోయింది. ఇక మాట్లాడటానికి ఏమీ మిగల్లేదు. థాంక్యూ పోర్చుగల్. థాంక్యూ ఖతర్’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు. క్వార్టర్‌ఫైనల్లో … Read more

  ఈ ఆటగాడి గుండెధైర్యానికి సలామ్

  జెర్సీ సినిమాలో హీరో నానికి గుండె సమస్య ఉంటుంది. అయినా ఇండియా జెర్సీ కోసం చనిపోయేదాకా పోరాడుతాడు. కానీ, అది రీల్. ఈ ఆటగాడి కథ రియల్. ఇతడికి గుండె సమస్య ఉంది. ఎక్కువగా పరిగిత్తితే ఆయాసంతో శ్వాస తీసుకోలేడు. డిఫిబ్రిల్లేషన్ చేస్తే తప్ప ఇతడి పరిస్థితి కుదుటపడదు. అయినా, దేశం కోసం ఆడాలన్న తపన ఈ ఆటగాడిని హీరోను చేసింది. నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ జట్టుకు చెందిన డేలీ బ్లైండ్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. అయినా, ఫుట్‌బాల్ కోసం ఇవేమీ లెక్కచేయకుండా దేశం తరఫున … Read more

  నోరా చేతిలో త్రివర్ణ పతాకం

  [VIDEO:](url) బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఫిఫా వరల్డ్‌కప్ ఫ్యాన్ ఈవెంట్‌లో తళుక్కుమంది. స్టేజిపై ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను అలరించింది. దోహాలో జరిగిన ఈ కార్యక్రమలో నోరా ఫతేహి బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేసింది. అనంతరం భారతీయ త్రివర్ణ పతాకాన్ని చేతబూని రెపరెపలాడిస్తూ ‘జైహింద్’ అని నినాదాలు చేసింది. అక్కడున్న వారితోనూ ‘జై హింద్’ అని నినాదాలు చేయించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫిఫా ఈవెంటులో భారత్ తరఫున్ నోరా ప్రాతినిథ్యం వహించింది. అంతకుముందు ఇంటర్నేషనల్ ర్యాపర్ నిఖి మినజ్‌తో … Read more

  ఫుట్‌బాల్, క్రికెట్ సమరాల్లో ఈ 3 జట్లు!

  ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన క్రీడలు ఫుట్‌బాల్, క్రికెట్. కొన్ని దేశాలు ఈ రెండు క్రీడల్లో విశేషంగా రాణిస్తుంటాయి. ఇటీవల క్రికెట్ ప్రపంచకప్ ముగిసింది. ప్రస్తుతం ఫుట్‌బాల్ సమరం నడుస్తోంది. ఈ రెండు క్రీడల్లో మూడు జట్లు ప్రాతినిథ్యం వహించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాయి. అవే నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు. టీ20 కప్పు గెలిచిన ఇంగ్లాండ్, ఫిఫాలో గ్రూప్ బిలో టాప్ ప్లేసులో కొనసాగుతోంది. సౌతాఫ్రికా, జింబాబ్వేలకు షాకిచ్చి.. 2024 ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించిన నెదర్లాండ్స్.. ఫుట్‌బాల్‌లోనూ గ్రూప్ ఎలో … Read more

  ‘ఐ లవ్యూ అమ్మా’; ప్లేయర్ భావోద్వేగం

  తల్లిపై ఉన్న ప్రేమను ఈ ఫుట్‌బాల్ క్రీడాకారుడు వినూత్నంగా చాటుకున్నాడు. 2-0తో బెల్జియంపై మొరాకో చరిత్రాత్మకమైన విజయం అనంతరం ఈ అపురూప దృశ్యం చోటుచేసుకుంది. మొరాకో మిడ్‌ఫీల్డర్ అశ్రఫ్ హకిమి మ్యాచ్ అనంతరం తల్లి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈక్రమంలో భావోద్వేగానికి లోనై కుమారుడికి ముద్దు పెట్టింది. ‘నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన ధీర వనిత. ఐ లవ్యూ అమ్మా’ అంటూ హకిమి తన జెర్సీని విప్పి తల్లి నుదిటిపై వెచ్చని ముద్దు పెట్టాడు. తల్లీకొడుకుల అనుబంధాన్ని చూసి స్టేడియం మురిసిపోయింది. … Read more

  ప్రపంచకప్‌లో మరో సంచలనం

  ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. నిన్న అర్జెంటినాను ఓడించి సౌదీ అరేబియా చరిత్ర సృష్టించగా.. నేడు నాలుగు సార్లు ఛాంపియన్ అయిన జర్మనీకి పసికూన జపాన్ షాకిచ్చింది. గ్రూప్ ఈ లో భాగంగా తలపడిన ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం జర్మనీదే. బంతి పూర్తిగా తన నియంత్రణలోనే ఉంచుకున్న జర్మనీ తొలి అర్ధభాగంలోనే గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ, 75వ నిమిషంలో రిట్సు డోన్ గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. 83వ నిమిషంలో జపాన్ మళ్లీ గోల్‌పోస్ట్‌లోకి బంతిని పంపించి 2-1తో … Read more

  నోరు మూసుకున్న జర్మనీ ఆటగాళ్లు..!

  ఫిఫా ప్రపంచకప్‌లో ఖతార్ ఆతిథ్యంపై ఆయా జట్ల నుంచి నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా జర్మనీ జట్టు ఈ జాబితాలో చేరింది. మ్యాచ్‌కు ముందు దిగిన ఫొటోలో.. నోరు మూసుకున్నట్లుగా సంకేతాలిస్తూ ఆటగాళ్లు పోజులిచ్చారు. ఖతార్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని ఏడు ఐరోపా జట్లు నిర్ణయించాయి. స్వలింగ సంపర్కులకు మద్దతుగా ‘వన్ లవ్’ ఆర్మ్‌బ్యాండ్లు ధరించాలని నిశ్చయానికొచ్చాయి. కానీ, ఇలా చేస్తే కఠిన చర్యలుంటాయని ఫిఫా హెచ్చరించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీనికి నిరసనగా ఇలా ఫొటో దిగారు. కాగా, … Read more

  రొనాల్డోకు మాంచెస్టర్ యునైటెడ్ గుడ్ బై

  ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకి మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఉద్వాసన పలికింది. దాదాపు 14ఏళ్ల తరువాత క్లబ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన రొనాల్డో గతేడాది మాత్రమే ఆడాడు. ఇటీవల మాంచెస్టర్ జట్టుపై రొనాల్డో విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరస్పర ఒప్పందం ప్రకారం మాంచెస్టర్‌ నుంచి తొలగించినట్లు పేర్కొంది. కాగా, ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. పోర్చుగల్ దేశానికి చెందిన ఈ ఆటగాడికి ఈ ఫుట్‌బాల్ ప్రపంచకప్ బహుశా చివరిది కావొచ్చు.