• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హమాస్ మిలిటెంట్ల మారణ హోమం

    ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు మారణ హోమం సృష్టించారు. ఒకే సారి 260 మంది ప్రాణాలు తీసి కర్కశంగా వ్యవహరించారు. గాజా సరిహద్దులోని కిబ్బుజ్ రీమ్ వద్ద జరిగిన ఓ మ్యాజిక్ పార్టీకి దాదాపు 3 వేల మంది హాజరుకాగా మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఆ సమయంలో వారంతా కార్లలో పారిపోయేందుకు ప్రయత్నించగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారిపై మిలిటెంట్లు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. మరికొన్ని చోట్ల ఇళ్లలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు.

    యుద్ధం కోరుకోలేదు.. కానీ తప్పడం లేదు

    ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతున్న యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం తాము మొదలు పెట్టలేదని.. అయితే ముగింపు మాత్రం తామే ఇస్తామని వెల్లడించారు. ఇజ్రాయెల్ యుద్దం కోరుకోలేదని, అయినప్పటికీ దేశం కోసం తప్పడం లేదని చెప్పారు. హమాస్ సైతం ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థేనని, ప్రజలంతా ఏకమై దానిని ఓడించాలని కోరారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిస్తే నాగరిక ప్రపంచం మొత్తం గెలిచినట్లేనని ఆయన అన్నారు.

    ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు

    ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమ దేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. వివాదాస్పద గాాజా స్ట్రిప్ ప్రాంతంలో పాలస్తీనా మిలిటెంట్లు ఈ రోజు తెల్లవారుజామున రాకెట్లతో దాడులకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్‌‌పై మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించామని, 5వేల రాకెట్లతో దాడులు చేశామని చెబుతూ హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ ఓ వీడియో విడుదల చేశారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తమైంది.