• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హార్ట్‌ టచింగ్‌గా నానీ మూవీ గ్లింప్స్‌

    న్యాచురల్‌ స్టార్‌ నానీ లేటెస్ట్‌ మూవీ NANI 30 నుంచి ఫస్ట్‌ లుక్, టైటిల్‌ గ్లింప్స్‌ వీడియో లాంఛ్‌ అయింది. ఈ చిత్రానికి ‘హాయ్‌ నాన్న’ టైటిల్‌ను మేకర్స్‌ ఫైనల్ చేశారు. ఇందులో నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లు గ్లింప్స్‌తో డైరెక్టర్‌ శౌర్యువ్‌ క్లారిటీ ఇచ్చేశాడు. సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి హృదయం ఫేం హెశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ సంగీతం అందిస్తున్నాడు. #MrunalThakur #KiaraKhanna … Read more

    ఈసారి ఫర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది: ‘ఉస్తాద్’ గ్లింప్స్

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ నుంచి టీజర్ గ్లింప్స్ విడుదలైంది. ఈ గ్లింప్స్‌ను ఉస్తాద్ చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ గ్లింప్స్ పవన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘ఈసారి ఫర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది’ అంటూ పవన్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. కాగా ఈ మూవీలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. డైరెక్టర్ హరీశ్ శంకర్ రూపొందిస్తున్నారు. మైత్రీమూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

    ‘ఓం శ్రీ క‌న‌క‌దుర్గ’ పాన్ఇండియా మూవీ గ్లింప్స్ రిలీజ్

    వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, మేఘ ఆకాశ్, సుమంత్ శైలేంద్ర కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్న ‘ఓం శ్రీ క‌న‌క‌దుర్గ’ మూవీ గ్లింప్స్ నేడు రిలీజ్ చేశారు. మంచికి, చెడుకి..ప్రేమ‌కు, భ‌యానికి జ‌రిగే యుద్ధ‌మే ఈ క‌థ అని తెలుస్తుంది. షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. లంక శ‌శిధ‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పాన్ఇండియా మూవీగా ఇది తెర‌కెక్కుతుంది. నెక్స్‌జెన్ పిక్చ‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.