భారత్‌లోకి 2,000 కిలోల బంగారం స్మగ్లింగ్
అక్రమంగా భారత్‌లోకి తీసుకువచ్చిన రూ.2,000 కిలోల బంగారాన్ని సీజ్ చెసినట్లు CBIC వెల్లడించింది. ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో ఇంత మొత్తంలో పట్టుబడిందని పేర్కొంది. గత వార్షిక ప్రాతిపదికతో పోలిస్తే ఇది 43 శాతం పెరిగినట్లు పేర్కొంది. క్రితం ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.3,800 కిలోల అక్రమ బంగారం పట్టుబడ్డట్లు వెల్లడించింది. అత్యధికంగా మయన్మార్, నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి భారత్‌లోకి బంగారాన్ని దుండగులు స్మగ్లింగ్ చేస్తున్నట్లు పేర్కొంది.