ఇజ్రాయేల్ వార్నింగ్పై ఐరాస ఆందోళన
గాజా- ఇజ్రాయేల్ యుద్ధంపై ఐక్యరాజ్య సమితి ఆందోళ వ్యక్తం చేసింది. తాజాగా గాజాలో నివసిస్తున్న ప్రజలు 24 గంటల్లోగా ఖాళీ చేసి దక్షిణాదికి వెళ్లాలని ఇజ్రాయేల్ సైన్యం హెచ్చరించింది. గాజాలో ఉన్న హమాస్ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీని వల్ల సామాన్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని వెల్లడించింది. 11 లక్షల మంది సామాన్యులు ఉన్నపళంగా వెళ్లడం ఎలా సాధ్యమవుతుందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. రెండు వర్గాలు సంయమనం పాటింటాలని సూచించింది.