• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలుగు సినిమా హిట్స్ , ఫ్లాప్స్-2022

    తెలుగు సినీ పరిశ్రమ ఈ ఏడాది భారీ హిట్లను కొట్టింది. ఆర్ఆర్ఆర్‌తో మెుదలైన ప్రభంజనం హిట్-2 చిత్రం వరకు కొనసాగింది. బింబిసార, ఒకే ఒక జీవితం వంటి సినిమాలు ప్రేక్షకుల్ని టైం ట్రావెల్ చేయిస్తే…సీతారామం లాంటి కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రం యువతను ఉర్రూతలూగించింది. రెండో అర్ధభాగంలో కార్తీకేయ-2 పాన్ ఇండియా లెవల‌్‌లో హిట్ కొట్టింది. విక్రమ్, కాంతారా వంటి పరభాష చిత్రాలు తెలుగులో విడుదలై సంచలనాలే సృష్టించాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ రాధేశ్యామ్, విజయ్ లైగర్ బాక్సాఫీస్ వద్ద … Read more

    కాంతారా అద్భుతం : త్రిష

    కాంతారా చిత్రం విడుదలై రోజులు గడుస్తున్నా ఇంకా ప్రభావం తగ్గట్లేదు. ఇటీవల ఓటీటీ వేదికగా రిలీజ్ కావటంతో మరికొంత మంది నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కాంతారా చిత్రంపై హీరోయిన్ త్రిష పొగడ్తల వర్షం కురిపించారు. సినిమా చూశానని తనకు ఎంతగానో నచ్చిందని ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టారు. చిత్రంలో నటించి స్వీయ దర్శకత్వం వహించిన రిషబ్ షెట్టి సహా చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. త్రిష ఇటీవల పొన్నియన్ సెల్వన్ తో మళ్లీ హిట్ అందుకున్నారు.

    రిషబ్ అన్నా..పాట మార్చే జరా ?

    బ్లాక్ బస్టర్ చిత్రం కాంతారా ఓటీటీలో విడుదలైనప్పటికీ…ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు. సినిమాలో ప్రధానాకర్షణగా నిలిచే వరాహరూపం పాటను మార్చటంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భూతకోల ఆడే వ్యక్తిని పంజుర్లి దేవత ఆవహించిన సమయంలో వచ్చే పాట ప్రేక్షకుల్ని లీనం చేస్తుంది. ఇందులో రిషబ్ షెట్టి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. కానీ, ఈ పాటపై కాపీరైట్ రావటంతో ట్యూన్ మార్చారు. కొత్త ట్యూన్ అస్సలు బాగాలేదని… రిషబ్ అన్నా కొత్తది కిక్ రావట్లేదని అంటున్నారు.

    కేజీఎఫ్ ను కాంతారా దాటేస్తుందా ?

    కాంతారా చిత్రం రికార్డులు తిరగరాస్తోంది. విడుదలైన మెుదటి రోజు నుంచే సంచలనం సృష్టించిన ఈ సినిమా కన్నడ బాక్సాఫీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. కర్ణాటకలో చరిత్ర సృష్టిస్తోంది. కేజీఎఫ్-2, కేజీఎఫ్-1 రికార్డులను దాటేందుకు చేరువలో ఉంది. ఇప్పటికే కాంతారా చిత్రం దాదాపు రూ. 152.90 గ్రాస్ కలెక్ష్లు సాధించింది. కేజీఎఫ్-2 రూ. 155 కోట్లతో మెుదటిస్థానంలో ఉంది. కేవలం 2.10 కోట్ల దూరంలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అతి తక్కువ దూరంలోనే ఉండటంతో త్వరలోనే యశ్ చిత్రం రికార్డులను … Read more

    కాంతార కలెక్షన్ల ప్రభంజనం

    కాంతార కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. హిందీ వెర్షన్‌ లో ఈ సినిమా ఏకంగా రూ. 50 కోట్ల నెట్ వసూలు చేసినట్లు తెలిసింది. బాలీవుడ్‌లో రిలీజైన సినిమాలు పెద్దగా లేకపోవడంతో ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. వారాంతం కావడంతో సినిమా సూపర్ స్ట్రాంగ్ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ చిత్రంలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటించగా సప్తమి గౌడ హీరోయిన్‌గా అలరించింది.

    కాంతారా కలెక్షన్ల సునామీ

    కాంతారా చిత్రం బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. హిట్‌టాక్‌తో దూసుకుపోతున్న చిత్రం ప్రపంచవ్యాప్తంగా 243 కోట్ల వసూళ్లు సాధించింది. దేశంలో 225 కోట్లకుపైగా వసూలు చేసింది. కర్ణాటకలో ఇప్పటికే 140 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనూ 35 కోట్ల వసూళ్లు సాధించింది. ఉత్తరాదిన 40 కోట్ల మార్క్‌ వద్ద ముగియగా…ఓవర్‌సీస్‌లోనూ 18 కోట్లు వచ్చాయి. కేజీఎఫ్‌ రికార్డును దాటి రెండోస్థానంలో నిలిచింది. ఇవాళ 250 కోట్లు దాటుతాయని అంచనావేస్తున్నారు.

    బాలీవుడ్‌లోనూ కాంతారా ప్రభంజనం

    దక్షిణాదిలో సంచలనం సృష్టిస్తున్న ‘కాంతారా’ చిత్రం హిందీలోనూ రికార్డులు బద్దలుకొడుతోంది. బాలీవుడ్‌లో దీపావళికి విడుదలైన చిత్రాలన్నింటికన్నా మంచి వసూళ్లు సాధిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మెుదటివారం కంటే రెండోవారం కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.31.70 కోట్ల వసూళ్లు రాబట్టిందని వెల్లడించారు. ఇదేస్థాయిలో మరికొన్ని రోజులు చిత్రం కొనసాగవచ్చంటున్న ట్రేడ్‌ వర్గాలు…కాంతారా చిత్రం రికార్డులు తిరగరాయటం ఖాయమంటున్నారు.

    బాలీవుడ్‌లో ‘కాంతారా’ రికార్డు వసూళ్లు

    దక్షిణాదిలో సంచలనం సృష్టించిన కన్నడ చిత్రం ‘కాంతారా’ బాలీవుడ్‌లోనూ దుమ్మురేపుతోంది. హిందోలో ఇటీవల మంచి వసూళ్లు రాబడుతోంది. ఇటీవల హిందీలో హిట్‌ అయిన తమిళ చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌ 29 కోట్లు లైఫ్‌ టైం వసూళ్లు సాధించి రికార్డు సృష్టిస్తే వాటిని దాటేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుమారు 30 కోట్ల మార్క్‌కు చేరువైనట్లు చెబుతున్నాయి. వసూళ్లు ఇదే మాదిరిగా కొనసాగితే మరిన్ని రికార్డులు నమోదు చేస్తోందని భావిస్తున్నారు. కాంతార సినిమాకు రిషబ్‌ షెట్టి స్వీయ దర్శకత్వం వహించారు.

    కాంతారపై రజనీ ప్రశంసల వర్షం

    కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతారపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. కాంతార చిత్రం తనకు గూస్‌బంప్స్ ఇచ్చిందని ట్వీట్ చేశారు.హీరోగానే కాకుండా ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు అయిన రిషబ్ శెట్టిని రజనీ అభినందించారు. కాంతార ఇండియన్ సినిమాలో మాస్టర్పీస్ అని, మొత్తం టీమ్‌కి తన అభినందనలు తెలిపారు. ఈ చిత్రంలో సప్తమి గౌడ కథానాయికగా నటించగా, హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

    కాంతారా మట్టిలో నుంచి పుట్టింది: అల్లు అరవింద్

    కాంతారా సక్సెస్‌ మీట్‌లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు.’సినిమాకు లాంగ్వేజ్ బారియర్ లేదని ఎమోషన్ బేరియర్ మాత్రమే ఉందని ‘కాంతార’ నిరూపించింది. ఏ ఎమోషన్‌తో సినిమా తీస్తే ఆ ఎమోషన్‌కు జనం కనెక్ట్ అయిపోతారని కాంతారా చూపించింది. కాంతారా కథ మట్టిలో నుంచి పుట్టింది. రిషబ్ శెట్టి వాళ్ల ఊళ్లో జరిగిన కొన్ని విశేషాలను ఈ కథలోకి తీసుకొచ్చి సినిమా రూపం ఇచ్చారు’ అని చెప్పుకొచ్చారు.