• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధోని నుంచి అవి నేర్చుకోవాలి: గైక్వాడ్

    ఆసియా క్రీడల్లో భారత జట్టుకు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ సారథ్యం వహిస్తున్నాడు. తొలి మ్యాచ్ రేపు నేపాల్‌తో జరగనుంది. ఈ నేపథ్యంలో గైక్వాడ్‌ స్పందించాడు. ‘ధోనీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన స్టైల్‌, ఆయన వ్యక్తిత్వం విభిన్నం. పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలి? మ్యాచ్‌ సమయంలో కొందరు ఆటగాళ్లతో ఎలా ప్రవర్తించాలి? వంటివి ఆయన నుంచి నేర్చుకోవాలి. అయితే, నా స్టైల్‌లోనే కెప్టెన్సీని నిర్వర్తించాలని కోరుకుంటున్నా. ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను ఇచ్చేలా వారికి పూర్తి స్వేచ్ఛనిస్తా’ అని గైక్వాడ్‌ చెప్పాడు.

    18 ఏళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు..

    మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు గురించి ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కెప్టెన్ కూల్. 18 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌పై ధోని తన అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. విచిత్రంగా ధోని కెరీర్ రనౌట్‌తో ప్రారంభమై రనౌట్‌తోనే ముగిసింది. తన సారధ్యంలో మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించి పెట్టాడు. బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానం ఏర్పాటు చేసుకున్నాడు. దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా నిలిచిపోయాడు.