• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆమె చెప్పింది.. ఈయన తీసుకొచ్చాడు

  మహిళ హనీ ట్రాప్ బారిన పడి ఓ వ్యక్తి డ్రగ్స్ స్మగ్లింగ్‌కి పాల్పడ్డాడు. రూ.28 కోట్ల విలువైన కొకైన్‌ని దేశంలోకి తీసుకొస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడు పట్టుబడ్డాడు. ఇథియోపియా నుంచి వస్తున్న ప్రయాణికుడు విమానాశ్రయంలో 2.8కిలోల కొకైన్‌తో పోలీసులకు చిక్కాడు. విచారణ చేస్తే ఓ మహిళ వల్లే ఆ వ్యక్తి ఇక్కడికి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తేలింది. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని సన్నిహితురాలైంది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. ఇలా చేయించిందని విచారణలో బయటపడింది. కాగా, ఇథియోపియా నుంచి డ్రగ్స్ తీసుకురావడం ఇది మూడో సారి.

  చాయ్, సమోసా, బాటిల్ ధర.. రూ. 490

  సాధారణంగా చాయ్, సమోసా ధర తక్కువే ఉంటుంది. కానీ, ముంబై ఎయిర్‌పోర్టులో మాత్రం వీటి ధర రూ.490 అట. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ నెటిజన్ విస్మయం వ్యక్తం చేశారు. అంతే కాదు.. ప్రధాని మోదీకి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘రెండు సమోసా, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ ధర రూ.490. మంచి రోజులు వచ్చేశాయ్’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి నెటిజన్లు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఇంత ధరేంటి? అని ప్రశ్నిస్తున్నారు. అదే ముంబయిలో కేవలం రూ.52కే రెండు సమోసా, … Read more

  సిరాజ్‌కు చేదు అనుభవం; ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగ్ మిస్

  భారత పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. బంగ్లాదేశ్ పర్యటన ముగించుకుని విస్తారా విమానంలో ముంబై చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత సిరాజ్ మూడు బ్యాగుల్లో రెండే ఉన్నాయి. ఈ విషయం అక్కడి సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదు. దీనిపై ట్విటర్ ద్వారా విస్తారా సహాయం కోరాడు. ఆ బ్యాగ్‌లో విలువైన వస్తువులు ఉన్నాయని తెలిపాడు. దీంతో విస్తారా ఎయిర్‌లైన్స్ వెంటనే స్పందించింది. వీలైనంత త్వరగా బ్యాగ్ కనిపెట్టి అందజేస్తామని సిరాజ్‌కు హామీ ఇచ్చింది.

  షారూక్‌ని ఆపిన ముంబై పోలీసులు

  బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ ముంబయి విమానాశ్రయంలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. షార్జా నుంచి ముంబయికి తిరిగిరాగా అతడి వద్ద ఖరీదైన వాచీలున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. రూ.18లక్షలు విలువ చేసే వాచీలతో పాటు ఖాళీ రోలెక్స్ వాచీల డబ్బాలు కనిపించాయి. దీంతో షారూక్‌తో పాటు అతడి మేనేజర్, బాడీ గార్డులను అధికారులు విచారించారు. తొలుత షారూక్‌ని పంపించేసి ఆ తర్వాత తెల్లవారుజాము వరకు బాడీగార్డులను విచారించినట్లు తెలుస్తోంది. కాగా, రూ6.83లక్షల కస్టమ్స్ సుంకాన్ని షారూక్ చెల్లించినట్లు సమాచారం.

  చీరల్లో దాచిన రూ.4.1 కోట్లు స్వాధీనం

  ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు భారీగా అమెరికన్ [కరెన్సీ](url) స్వాధీనం చేసుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజా ఎయిర్‌పోర్ట్‌లో దుబాయ్ వెళ్తున్న ముగ్గురి బ్యాగులను తనిఖీ చేశారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ముగ్గురు వ్యక్తులు రూ.4.1 కోట్ల విలువైన యూఎస్ డాలర్లతో పట్టుబడ్డారు. చీరలు, చెప్పులు, బ్యాగుల్లో దాచి తీసుకెళ్తుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరు పర్చగా, వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు. #WATCH | In a targeted op by AIU, … Read more

  బాప్‌రే.. రూ.34కోట్ల డ్రగ్స్ లభ్యం

  ముంబయిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్థం పట్టుబడింది. ఓ విదేశీ ప్రయాణికుడి వద్ద 5కిలోల హెరాయిన్ సరుకు లభ్యమైంది. దీని విలువ సుమారు రూ.34కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఓ ట్రావెల్ బ్యాగులో గుట్టుగా మత్తుపదార్థం తరలిస్తున్నట్లు అనుమానించి తనిఖీలు చేయగా హెరాయిన్ బయటపడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు.